మనసు దోచే(య్) పాటలు

April 11, 2015 | 01:28 PM | 36 Views
ప్రింట్ కామెంట్
Dochey_Audio_Launch_niharonline

రోజుకో పాట చొప్పున అభిమానులకు అందించిన దోచెయ్ సినిమా పాటల వేడుక నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. అక్కినేని నాగచైతన్య, కృతిసనన్ జంటగా నటించిన ‘దోచేయ్’ సినిమా శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్లో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా, సన్నీ సంగీతం అందించారు. ఈ వేడుకలో బిగ్ సీడీని కీరవాణి విడుదల చేయగా, ఆడియో సీడీలను నాగార్జున ఆవిష్కరించారు. థియేట్రికల్ ట్రైలర్ను రాజమౌళి, సుకుమార్ సంయుక్తంగా విడుదల చేశారు. ఆడియో లహరి ద్వారా విడుదలైంది. ఈ సందర్భంగా పలువురు అతిధులు ప్రసంగించారు. హను రాఘవపూడి మాట్లాడుతూ... ‘స్వామిరారా సినిమా అంటే నాకు ఇష్టం.  సినిమాలో సంగీతం కూడా చాలా బావుంటుంది. కేకే ఈ సినిమాలోని పాటలను కూడా బాగా రాశారు’ అన్నారు. రాధాక్రుష్ణకుమార్ మాట్లాడుతూ ‘విన్న పాట బాగుంది. టీమ్ కు ఆల్ ద బెప్ట్’ అన్నారు.  కేకే మాట్లాడుతూ ‘హనురాఘవపూడికి, రాధాక్రుష్ణకుమార్ కు పాటలు రాశాను. వాళ్ళిద్దరూ నా పాట బావుందని చెప్పడం ఆనందంగా ఉంది అన్నారు.  సుశాంత్ మాట్లాడుతూ ‘సినిమా టైటిల్లో చెయ్ అని రావడం చాలా బావుంది. క్రియేటివ్ గా ఉంది. సన్నీ మంచి సంగీతాన్నిచ్చాడు’ పోసాని క్రిష్ణ మురళి మాట్లాడుతూ ‘నామీద సుధీర్ వర్మ పాటను తీశాడు. ప్రసాద్ గారు సినిమాను ప్రేమిస్తారు. నాకు తెలిసి వినబుద్ధి అయిన పాటలు మంచి పాటలు. కీరవాణిగారు సమకూర్చిన పాటలు అలాంటివే. సన్నీ ఇన్ స్ర్టుమెంట్ వాడడంలో చాలా ఘటికుడు.’ అన్నాడు. బ్రహ్మానందం మాట్లాడుతూ... ‘సుధీర్ వర్మ తనకు కావాల్సిన దాన్ని ఈజీగా చేయించుకుంటాడు. తన ప్రతి పనీ కొత్తగ ఉంటుంది. ఇందులో బుల్లెట్ బాబు అనే పాత్రలో హీరోగా నటించాను. పాటలు కొత్తగా ఉన్నాయి’ అన్నారు. కరుణాకరన్ మాట్లాడుతూ ‘ఈ టీమ్ కు హిట్ రావాలి’ అన్నారు. చందుమొండేటి మాట్లాడుతూ ‘నేను నాగార్జున గారిని చూద్దామని పరిశ్రమకు వచ్చాను. నాదంటూ ఓ ఐడెంటిటీతో వెళ్ళి కలిశాను. ఆర్య సినిమా చూశాక దర్శకుడిని అవుదామనిపించింది. స్వామి రారా వల్ల నాకు కార్తికేయ ఛాన్స్ వచ్చింది. హిట్ తీయాలనే కోరిక మాత్రం రాజమౌళి గారి నుంచే నాకు అబ్బింది’’ అని తెలిపారు. హీరో నాగ చైతన్య మాట్లాడుతూ రెండు వారాల ముందు నాలుగు పాటలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాం. మంచి స్పందన వచ్చింది. నా కెరీర్ లో ఇది నైస్ ఆల్బమ్ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సుకుమార్ రాజమౌళి, సుధీర్ వర్మ, క్రుతిసనన్ తదితరులు ప్రసంగించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ