డాలర్ కి మరోవైపు ఆడియో ఆవిష్కరణ

May 28, 2015 | 05:13 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Dollar_ki_Marovaipu_Audio_niharonline

బేబి శ్రీక్రితి సమర్పణలో సాయిరామ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నాజర్‌, యశ్వంత్‌, మిత్ర ప్రధానపాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘డాలర్‌కి మరోవైపు’. పూసల దర్శకత్వంలో సత్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. కమల్‌ కుమార్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, ఎఫ్‌.ఎన్‌.సి.సి. ప్రెసిడెంట్‌ కె.యస్‌.రామారావు, కోడి రామకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్‌,  నాజర్‌, ఏడిద శ్రీరాం, దేవీ ప్రసాద్‌, వీరశంకర్‌, శివాజీరాజా, యశ్వంత్‌, మిత్ర, కమల్‌ కుమార్‌ సహా చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఆడియో సీడీలను ‘మా’ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా... ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘పూసలగారితో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను బావగారు అని పిలిచేవారు. నేను ఎక్కువగా పనిచేసిన రచయితల్లో ఆయన ఒకరు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే సౌతిండియాలోని గొప్పనటుల్లో ఒకరైన నాజర్‌ ప్రధానపాత్ర పోషించారు. ఇలాంటి వాల్యూస్‌ ఉన్న చిత్రాలను ప్రోత్సహించాలని  అందరినీ కోరుకుంటున్నాను. యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

 

మండలి బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘చిన్నప్పట్నుంచి పూసలగారు నాకు మంచి ఆత్మీయులు. బాగా చదువుకున్న వ్యక్తి. నాటకరంగానికి ఎనలేని సేవ చేశారు. ఎన్నో నాటకాలకు అద్భుతమైన సంభాషణలను సమకూర్చారు. అలాంటి వ్యక్తి డైరెక్ట్‌ చేసిన సినిమా ఇది. కచ్చితంగా మంచి విలువలున్న సినిమా అనడంలో సందేహం లేదు. చిన్న సినిమాల విడుదల కష్టమైన ఈ తరుణంలో సినీ పెద్దలు ఇటువంటి మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాలను విడుదల చేయడానికి ముందుకు రావాలి. ఈ సినిమా విజయం ద్వారా పూసలగారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

 

చిత్ర నిర్మాత సత్యం మాట్లాడుతూ ‘‘సినిమాని 28రోజుల్లో అందరి సహాయ సహాకారాలతో పూర్తి చేశాం. సినిమా చూసిన వారి గుండె బాధతో బరువెక్కుతుంది. అలా కావడం లేదు అన్నవారికి నేను లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తాను. సినిమా అంత బాగా వచ్చింది. కమల్‌ కుమార్‌ సంగీతం బాగా కుదిరింది. సినిమాని బాగా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

 

కె.యస్‌.రామారావు మాట్లాడుతూ ‘‘డాలర్‌ చాలా విలువైనది కాబట్టి మనం ఇక్కడ మన వారినందరినీ వదిలేసి విదేశాలకు వెళ్లి డాలర్లను సంపాదిస్తుంటాం. ఇలాంటి కాన్సెప్ట్‌తో మన మనసులు కదిలించే విధంగా పూసలగారు కథను తయారు చేసుకుని ఉంటారు.  ఇటువంటి సినిమాలో నాజర్‌గారు పనిచేయడం సినిమాకి చాలా ప్లస్‌ అవుతుంది. యూనిట్‌కి అభినందనలు’’ అన్నారు.

 

కోడిరామకృష్ణ మాట్లాడుతూ ‘‘ఈ టైటిల్‌ పెట్టడంలోనే పూసలగారి గట్స్‌ ఎంటో తెలుస్తుంది. నాటక రంగంలో ఎన్నో సంచనాలు సృష్టించి సినిమా రంగంలోకి వచ్చిన పూసలగారు రెవల్యూషన్‌ భావాలున్న దర్శకుడు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అయి ఆయనకు పెద్ద నివాళి కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

 

మ్యూజిక్‌ డైరెక్టర్‌ కమల్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘మంచి సంగీతం కుదిరింది. అవకాశం ఇచ్చిన వారికి థాంక్స్‌’’ అన్నారు.

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పూసలగారిని స్మరించుకుని, యూనిట్‌ను అభినందించారు.

 

కైకాల సత్యనారాయణ, ప్రభావతి, కొండవలస, స్నేహ, ఆప్పికట్ల, వినోద్‌, శివాజీరాజా, ఉమ, సుధ తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి కథ: శ్రీమతి జమున, పాటలు: పల్లేటి, ‘డాడి’ శ్రీను, డాన్స్‌: దిలీప్‌, ఆర్ట్‌: ఇ.రామకృష్ణ, ఎడిటింగ్‌: నందమూరి హరి, కెమెరా: కె.వీరా, సంగీతం: కమల్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పూసల బుజ్జి, నిర్మాత: సత్యం, మాటలు` స్క్రీన్‌ప్లే ` దర్శకత్వం: పూసల.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ