చిరంజీవి బర్త్ డే మెనూలో ప్రత్యేకంగా దోశను చేర్చారట. అది కూడా చిరంజీవి కుక్ తో ప్రత్యేకంగా చేయించిన దోశలను అతిథులను రుచి చూపించనున్నారట. చిరంజీవి బర్త్ డేకు బాలీవుడ్, కోటీవుడ్ నుంచి కూడా సెలబ్రిటీలు రానుండడంతో ప్రత్యేక వంటను వారికి రుచి చూపించబోతున్నారు. చిరుకు దోశెలంటే చాలా ఇష్టమట. అందులో చిరంజీవి ఇంట్లో కుక్ తయారు చేసే దోశ రుచి మరెక్కడా ఉండదట. అందువల్లే మెనూలో ఈ టిఫిన్‌ను ప్రత్యేకంగా చేర్చారు. చిరు తనయుడు, సినీ హీరో రామ్‌చరణ్ తేజ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని సమాచారం.