80 దశకం తారల సందడి

August 31, 2015 | 04:26 PM | 3 Views
ప్రింట్ కామెంట్
1980s_batch_hero_heroins_niharonline

చిరంజీవి పుట్టిన రోజు తరువాత మళ్ళీ ఇలా సినీ తారలంతా చెన్నైలో కలుసుకుని గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు. వీరంతా 1980వ దశకంలోని వెండితెరపై హీరోహీరోయిన్లుగా వెలిగిపోయిన వారు. కాకపోతే ఇప్పుడు హీరోయిన్లు అమ్మ పాత్రల్లోకి దిగితే, హీరోలు మాత్రం కొందరు తప్ప మిగిలివారు హీరోలుగానే వెండితెరపై వెలిగిపోతున్నారు. వీరంతా కలిసి ఆనాటి జ్ఞాపకాల్ని పంచుకున్నారు. మళ్ళీ కలిసి స్టెప్పులేశారు. ఈ అపురూప ఘట్టానికి చెన్నై వేదికైంది. అక్కడి ఆలీవ్‌ బీచ్‌లోని ఓ అతిథి గృహంలో 80 దశకంలో వెండితెరపై వెలిగిన నటీనటులంతా ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సంబరాల్లో తెలుగు తారలు చిరంజీవి, వెంకటేష్‌, నరేష్‌, సుమన్‌ పాల్గొన్నారు. ఇక్కడంతా ఎరుపుదనంతో, ఎరుపు దుస్తుల్లో ఎర్రటి ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్లతో సుందరంగా అలంకరించారు. నటీమణులు సుహాసిని, ఖుష్బూ ఈ ఏర్పాట్లను చూసుకున్నారట. ఈ వేడుకను వరుసగా ఆరో సంవత్సరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్త అతిథులుగా బాలీవుడ్‌ తారలు జాకీ ష్రాఫ్‌, పూనం దిల్లాన్‌, స్వప్న హాజరయ్యారు. గత సమావేశానికి సంబంధించిన వీడియోలను తిలకించారు. 80ల్లోవచ్చిన సినిమాల్లోని పాటలను (హిందీ, తమిళ, మలయాళ) గీతాలను మోహన్‌లాల్‌, సుహాసిని ఆలపించగా పూర్ణిమ, సుహాసిని, మేనక తదితరులు  స్టెప్పులు వేశారట. మొత్తం అందరూ కలిసి చేసిన లుంగీ డాన్స్‌ ఈ పార్టీకి ప్రత్యేకం. వాటిలో 12 లుంగీలను జాకీ ష్రాఫ్‌ తీపిగుర్తుగా ముంబయి తీసుకెళ్లారు. ఈ సంబరాల్లో భానుచందర్‌, సుమలత, సరిత, రాధ, రాధిక, రమ్యకృష్ణ, జయసుధ, సత్యరాజ్, నరేష్, రెహ్మాన్, శరత్ కుమార్లు కూడా పాల్గొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ