ప్రతిష్టాత్మకంగా బాహుబలికి పైరసీ బెడద తప్పలేదు. మూడేళ్లు ప్రయాసపడి తీసిన బాహుబలి చిత్ర కలెక్షన్ల ప్రభంజనం ఓ వైపు కొనసాగుతుండగానే, ఆన్ లైన్లో బాహుబలి పైరసీ దర్శనమిస్తుంది. ఒరిజినల్ ప్రింట్ ను తలపించేలా రీతిలో ఈ చిత్ర పైరసీని ఆన్ లైన్ లో పెట్టేశారు. http://cineview.me/letwatch.php?url=sdopj1ycc58n అనే లింక్ లో చిత్ర పైరసీ ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. మీటింగ్ పెట్టి మరీ పైరసీ కోసం అభ్యర్థించినప్పటికీ పైరసీదారులు మాత్రం తగ్గట్లేదు. కోట్ల కు కోట్లు పెట్టి తీసిన సినిమాని ఇలా ఆన్ లైన్లో పెట్టేసరికి జనాలు కూడా ఎగబడి చూసేస్తున్నారు. దయచేసి ఇలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సగటు సినీ అభిమానులు కోరుకుంటున్నారు.