బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు సైకో విలన్ గా నటించి భయపెట్టిన శక్తి కపూర్ యాక్సిడెంట్ తో మరణించాడనే వార్త ఒకటి సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేసింది. ఇది ఒక ఆకతాయి వాట్సాప్ లో పోస్టు చేసిన తప్పుడు వార్తకు ఫలితమే. ఇది అలా అలా దేశమంతా పాకి పోతుండడంతో శక్తి కపూరే స్టేట్ మెంట్ ఇవ్వక తప్పలేదు. నేను బతికే ఉన్నాను మహానుభావా... నాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు. నా ఆరోగ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందీ లేదని స్వయంగా చెప్పుకున్నాడు. ఇది కేవలం ఫేక్ న్యూస్ మాత్రమేనని, ప్రజలు ఇది నమ్మవద్దని కపూర్ చెప్పారు. ఈ వార్తపై అటు-ఆయన కుమార్తె శ్రద్ధాకపూర్, ఆమె సోదరుడు సిద్ధాంత కపూర్ కూడా స్పందించి వాళ్ళ వంతుగా ఖండించారు. ఈ మధ్య కాలంలో సోషల్ నెట్ వర్క్ పుణ్యమా అని ఇలాంటి గాలి వార్తలు చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతున్నాయి. దీని వల్ల సెలెబ్రిటీలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇలా వార్త రావడమే ఆలస్యం వారి ఇళ్ళలో ఫోన్ల బాధ పెరిగిపోతోందట పాపం.