గోపాలా షూటింగ్ పూర్తవగానే గబ్బర్‌సింగ్-2 ప్రారంభిస్తాడని ఎన్నో వార్తలు వచ్చాయి. మధ్యలో మళ్లీ రాజకీయంవైపుకు మళ్ళుతున్నట్టు కూడా వార్తలు వినిపించాయి. కానీ ఇవేవీ నిజంకాదన్నట్టు గబ్బర్‌సింగ్-2ను త్వరగా పూర్తి చేసి మే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు కేఎస్.రవీంద్ర ఇప్పటికే కథను పక్కాగా సిద్ధం చేసుకున్నాడు. ఇక అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సిట్టింగ్స్ జనవరిలో స్టార్ట్ అవుతుందట. పవన్‌కు సన్నిహితులైన యంగ్ రైటర్స్ సినిమాకు మాటలు రాస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం పవన్ మొత్తం యంగ్‌టీంను రంగంలోకి దించుతున్నాడు. పవన్ సన్నిహితుడు శరత్‌మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఏదేమైనా పవన్ ఈ సినిమా త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుని సినిమాపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టనున్నాడని టాక్.