గజినీ హీరోయిన్ అసిన్ పెళ్ళి వ్యాపారవేత్త రాహుల్ శర్మతో జరగబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగి పోయింది. అయితే నవంబరు 26న దిల్లీలో వివాహం చేసుకోనున్నట్లు వార్త వినిపిస్తోంది. ఈ విషయానికి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఢిల్లీ ఓ హోటల్లో పెళ్ళి, మరునాడు వెస్ట్ ఎండ్ గ్రీన్స్ ఫామ్‌హౌస్‌లో రిసెప్షన్ జరుపుతున్నట్టు సమాచారం. ఇటీవల షాహిద్, మీరాల పెళ్లి ఈ ఫామ్‌హౌస్‌లోనే జరిగింది. రాహుల్ శర్మ మైక్రోమాక్స్ కంపెనీకి కో ఫౌండర్. ఈయనను అక్షయ్‌కుమార్ అసిన్‌కు పరిచయం చేశారు. ఇటీవల కాలంలో అసిన్ సినిమాలన్నీ ఫ్లాప్ కావడం... రాను రాను ఆమెకు తెలుగు, తమిళ సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఇక సినిమాకు గుడ్ చెపుతుందనుకుంటున్న దశలో బాలీవుడ్ లో ఓ అవకాశం చేజిక్కించుకుంది... కానీ ఇక్కడ కూడా ఆమెకు దురదృష్టమే ఎదురైంది అభిషేక్ తో చేసిన ‘ఆల్ ఈజ్ వెల్’ కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక పెళ్ళి వయసు కూడా మించి పోతుండడంతో రాహుల్ శర్మతో పెళ్ళి పీటలెక్కడం బెటరనే డెసిషన్ తీసుకున్నట్టు కనబడుతోంది.