గోపీచంద్ మౌంట్ అబూ అనుభూతి

March 19, 2015 | 04:05 PM | 51 Views
ప్రింట్ కామెంట్
Gopichand_niharonline

సినిమా వాళ్ళు మౌంట్ అబూ వెళ్ళారంటే... అక్కడేదో షూటింగ్ అనుకుంటారు. కానీ గోపీచంద్ రిలాక్స్ కోసం సతీమణి రేష్మాతో మౌంట్ అబూ వెళ్ళాడట. అక్కడ ఉన్న బ్రహ్మకుమారీల ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్నాడట. ఆ విశేషాలను చెబుతూ ‘‘అక్కడ ఉన్న డైమండ్  హాలులో పాతిక వేల మంది బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందం అనిపించింది. ఆ సమయంలో ఓ వింత అనుభూతికి లోనయ్యాను. అది మాటల్లో వర్ణించలేని అనుభూతి. అక్కడంతా ఓ ప్రశాంత వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది’’ అంటూ చెప్పుకొచ్చాడు గోపీ చంద్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ