‘గోవిందుడు అందరివాడేలే’ బాలీవుడ్ లోకి

January 14, 2015 | 03:08 PM | 36 Views
ప్రింట్ కామెంట్

రాంచరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ మూవీని హిందీలోకి రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమా హక్కులను తీసుకునేందుకు ప్రభుదేవా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. సాధారణంగా ఇలాంటి ఫామిలీ డ్రామాలంటే ప్రభుదేవాకు చాలా ఇష్టం. అతని దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లవ్ అండ్ ఎఫెక్షన్ తో కూడిన సెంటిమెంట్ పాళ్ళు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇది కూడా అలాంటి చిత్రమే కావడం, ఇలాంటి కథల కోసం వెతుకుతున్నప్రభుదేవాకి క్రుష్ణవంశీ తీసిన ‘గోవిందుడు అందరి వాడేలే’ బాగా ఆకట్టుకుంది. ఈ కథను నార్త్ నేటివిటీకి తగినట్టు మార్పులు చేస్తే మంచి సక్సెస్ మూవీ అవుతుందనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రకు హిందీలో కూడా అతన్నే ఎంపిక చేయనున్నట్టు తెలిసింది. తనకున్న మంచి మిత్రుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు కావడం, ఇంతకుముందే ప్రకాష్ రాజ్ పోకిరీ (వాంటెడ్) సినిమాలో కూడా నటించడంతో ఆయన్ను తిరిగి ఈ సినిమాకు తీసుకోబోతున్నారు. ఇప్పటివరకూ తెలుగు నుంచి హిందీలోకి రీమేక్ చేసిన పోకిరి (వాంటెడ్) విక్రమార్కుడు (రౌడీ రాథోడ్), నువ్వొస్తానంటే నేనొద్దంటానా(రామయ్యా వస్తావయ్యా) వంటి రీమేకులన్నీ బాలీవుడ్ లో సక్సెస్ సాధించాయి. దీంతో ‘గోవిందుడు అందరి వాడేలే’ కథతో మరోసారి బాలీవుడ్ లో సక్సెస్ సాధించడానికి సిద్ధమవుతున్నాడు ప్రభుదేవా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ