ఈ అమ్మడు అప్పుడే హీరోకి అమ్మవుతోంది

January 19, 2015 | 04:00 PM | 36 Views
ప్రింట్ కామెంట్

హిందీ సినిమా లగాన్ హీరోయిన్ గ్రేసీసింగ్, ఆ తరువాత తెలుగులో నాగార్జున సరసన ‘సంతోషం’లో , ‘తప్పు చేసి పప్పు కూడు’ సినిమాలో మోహన్ బాబుకు జతగా నటించింది. ఈ నటి గ్లామర్ తారగా కాకుండా హోమ్లీగా ఉండే పాత్రల్లోనే చేసింది. ఇప్పుడు ఈ అమ్మడు, అమ్మ పాత్రలో నటిస్తోందనే వార్త వినపడుతోంది. మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి ఈమె మహేష్ బాబుకు తల్లిగా నటిస్తోందట. హీరోయిన్లు తల్లి పాత్రల్లో నటించడం మామూలే కాకపోతే 80ల్లో వచ్చిన నదియా లాంటి హీరోయిన్లు ఇప్పుడు తల్లిగా వస్తే ఓకే... కానీ, గ్రేసీ సింగ్ 2000 లోనే ఎంటర్ అయ్యింది అప్పుడే అమ్మ పాత్రలో తెరమీదకు వస్తానంటోంది. ఇందులో మహేష్ తల్లిగా కీలకమైన క్యారెక్టర్ చేస్తోందట. ఈ చిత్రానికి ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ