టాలీవుడ్ లోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న కోలీవుడ్ నటుడు విషాల్. ఆయన సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అవుతుంటాయి. స్వతహాగా విశాల్ తెలుగు వాడు కావడం వల్లనో, పెర్ఫార్మెన్స్ నచ్చడం వల్లనో తెలుగులో అభిమానులు ఎక్కువే. ప్రస్తుతం రిలీజైన ఆయన సినిమా 'మగ మహారాజు'కు మంచి టాకే వచ్చింది. దాదాపు 500 థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా తమిళంలో హిట్టయిన ‘అంబాల' కు డబ్బింగ్. ఇందులో విశాల్ కు ముగ్గురు అత్తలుండడం, ఆ ముగ్గురు అలనాటి హీరోయిన్లు కావడం విశేషం. అందరూ తెలుగు వారికి సుపరిచితులే. పోలీసు అధికారిగా విశాల్ రోల్ ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది. ఆయనకు జోడీగా హన్సిక నటించింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఇది. ఇద్దరి కెమిస్ట్రీ బాగుందన్న టాక్ కూడా వచ్చింది. అయితే ఇందులో విశాల్ కు అత్తగా రమ్యకృష్ణ నటించింది. ఆమెకు ఇప్పటికీ తెలుగు వాళ్ళలో బాగా అభిమానులు ఉన్నారు. తమిళంలో తీసిన సినిమా కాబట్టి ఎక్కడో ఓ చోట ఆ టేకింగ్ కనిపించినా మినిమం కలెక్షన్లు తప్పని సరి అంటున్నారు సినిమా వర్గాల వారు.