త్రిషతో తనకి ఎలాంటి గొడవ లేదనీ, తామిద్దరం మంచి స్నేహితులమని హన్సిక చెప్పింది. 'కళావతి' సినిమా షూటింగ్ సమయంలో తమ ఇద్దరి మధ్యా మనస్పర్థలు తలెత్తాయనే ప్రచారాన్ని గురించి స్పందిస్తూ ఆమె ఈ మాట అంది. తమిళ్లో 'అరణ్మనై 2' చిత్రం తెరకెక్కింది. సిద్ధార్థ .. త్రిష .. హన్సిక .. పూనం బజ్వాతో పాటు దర్శకుడు సుందర్ సి. కూడా ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో తెలుగులో 'కళావతి' పేరుతో ఈ నెల 29న విడుదల కానుంది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో త్రిష - హన్సిక మధ్య గొడవ జరిగిందనే ప్రచారం కోలీవుడ్ లో జోరుగా జరుగుతోంది. ఈ విషయాన్ని హన్సిక దగ్గర ప్రస్తావించగా, ఈ ప్రచారం తన వరకూ వచ్చిందని ఆమె చెప్పింది. ఈ పుకారును గురించి తాను, త్రిష ఫోన్లో మాట్లాడుకుని నవ్వుకున్నామని అంది. త్రిష తనకి చాలా కాలంగా మంచి స్నేహితురాలనీ, ఆమెతో తనకి ఎలాంటి గొడవ జరగలేదని స్పష్టం చేసింది.