నేపాల్ రిలీఫ్ ఫండ్ కు హన్సిక ఆరు లక్షలు

May 12, 2015 | 03:20 PM | 14 Views
ప్రింట్ కామెంట్
Hansika_Motwani_nepal_releaf_fund_niharonline

డబ్బు సంపాదించడమే థ్యేయం కాదు... అది ఎక్కడ ఎలా ఉపయోగించాలనేది కొందరికి మాత్రమే తెలుస్తుంది. తాము సంపాదించిన దాంట్లోనే సమాజ సేవకు కొంత ఉపయోగపడినప్పుడు వారి పేరు ప్రఖ్యాతులు, గౌరవం మరింత పెరుగుతుంది. చిన్న వయసులోనే సినీ పరిశ్రమకు వచ్చి, తన సంపాదనను సమాజ సేవకు ఖర్చ చేస్తున్న హన్సిక లాంటి అమ్మాయిలు చాలా అరుదుగా కనిపిస్తారు. తన కెరీర్ తొలి నాటి నుంచి తనకు చేతనైనంతలో ఆమె సహాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆమె నేపాల్ రిలీఫ్ పంఢ్ కు ఆరు లక్షలు డొనేట్ చేశారు. చాలా మందికి స్ఫూర్తి నిచ్చారు. ఇప్పటికే హన్సిక కొందరు అనాధ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. కొంత మంది పిల్లలను దత్తత తీసుకుంది.  ఈ పిల్లలు తల్లిదండ్రుల వద్దే ఉంటారు. కానీ వారి ఆలనాపాలనా, చదువుకి అయ్యే ఖర్చులను మాత్రం హన్సిక భరిస్తున్నారు. తాజాగా ఈ పిల్లలను హన్సిక హాలీడే ట్రిప్ నిమిత్తం కులుమనాలికి తీసుకెళ్లే ప్లాన్లో ఉందట. జూన్ చివరి వారంలో ఈ ట్రిప్ ఉంటుందని తెలుస్తోంది. 1990ల్లో ఓ హిందీ సీరియల్ లో బాల నటిగా చేసిన ఈ చిన్నది ఇంతింతై అన్నట్టు అప్పుడే సమాజానికి ఏదో చేయాలనుకోవడం ప్రశంసనీయం. భవిష్యత్తులో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలన్నతన ఆలోచనను ఇప్పటికే వెల్లడి చేసింది. పిల్లల్ని చదివించడంతో పాటుగా  పిల్లల ఆదరణ కోల్పోయిన తల్లిదండ్రులను కూడా ఆదరించాలనుకుంటోందట. ఇన్ని మంచి పనులు చేస్తుంది కాబట్టే తమిళులు ఆమె కోసం గుడికట్టే రేంజిలో అభిమానం ఏర్పరచుకున్నారట. అందుకే ఆమెకు ఇప్పుడు తమిళంలో ఆరు ఆఫర్లు ఉన్నాయి. వాలు, అరన్మనయ్ సీక్వెల్ , ఉయిరే ఉయిరే,  మీగమన్, రోమియో జూలియట్ చిత్రాల్లో ఆమె నటిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ