ఇండస్ట్రీలో ఎవరినడిగినా చెపుతారు మహేష్ మంచితనం గురించి.... ఒక్కోసారి డబ్బింగ్ చెప్పుకోడానికి వెళ్ళినప్పుడు లోపలేదైనా డబ్బింగ్ కార్యక్రమం జరుగుతుంటే... అక్కడే ఉన్న మెట్ల మీద కూర్చుని మరీ వెయిట్ చేశాడట ఈ హీరో... ఈ సింప్లిసిటీ గురించి సినిమా వాళ్ళే చెప్పుకొచ్చారు. షూటింగ్ లోనూ ఫెసిలిటీస్ ఏ మాత్రం డిమాండ్ చేయకుండా సినిమా ఎలా వస్తుంది అని చూసుకోవడం మీదే తన దృష్టినంతా పెడతాడట మహేష్ బాబు. ఒక హీరోనన్న ఈగో ఏ కోణంలోనూ కనిపించదంటారు పెద్ద వాళ్ళ దగ్గరినుంచి లైట్ బాయ్స్ వరకూ... మరి అంత మంచోడు మరీ అంత మంచితనం లేదన్నాడట ఓ ఇంటర్వ్యూలో.... ఎందుకలా? తెలుసుకోవాలనిపిస్తుంది కదా...! ఒక్కోసారి మొహమాటానికి సినిమాలు ఒప్పుకుని ఎదురుదెబ్బలు తిన్న అనుభవం కూడా ఉంది మహేష్ కి. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన శ్రీమంతుడు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అసలు ఇలాంటి సినిమా తీసే ధైర్యం ఏ స్టార్ కూడా చేయలేడు. అయినా సరే ధైర్యం చేసి మూవీ తీయడమే కాకుండా.. అనేక మందికి గ్రామాలను దత్తత తీసుకోవాలనే ఇన్ స్పిరేషన్ కలిగించాడు. స్వయంగా తానే రెండు గ్రామాలను దత్తత తీసుకుంటున్నాడు కూడా. అయినా సరే నేనేం అంత మంచోడిని కాదంటున్నాడు కారణం... సూపర్ స్టార్ కృష్ణగారి అతి మంచితనమేనంటున్నాడు. ఆయనకు ఏ విషయంలోనూ నో అనడం తెలీదంటున్నాడు. అందుకే ఆయన కెరీర్ లో కొన్ని రాంగ్ సినిమాలు ఉన్నాయట. అంతే కాదు మొహమాటంతో నిర్మాతలకు డబ్బులేకుండా సినిమాలు చేసిపెట్టిన హీరో కూడా కృష్ణగారే అని సినిమా వాళ్ళకే కాదు మామూలు వాళ్ళకూ తెలిసిన విషయం. మహేష్... పదహారేళ్ల వయసులోనే ఇవన్నీ గమనించాడట. అందుకే అవన్నీ చూసి మరీ ఇంత మంచితనమైతే కష్టమనుకున్నాడేమో... ఆయన నుంచి మంచి చెడు నేర్చుకున్నానని... అంత మంచితనం వద్దనుకున్నానని చెబ్తున్నాడు. స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లాడట ఒకటి రెండుసార్లు. ఇదేనా మంచి కాకపోవడం... కాదు... అంత మంచితనం మొహమాటం పనికిరాదని మనసులో అనుకున్నా... కానీ అదే బ్లడ్ ఈయనలోనూ ప్రవహిస్తుంది కదా... మనసులో అనుకుంటే సరిపోతుందా? చేతలు చేయనీయవు మరీ.... అయినా మంచోళ్లు ఎప్పుడైనా నేను మంచోడిని అనరు... చెడ్డవాళ్లెప్పుడూ నేను చెడ్డవాణ్ణి అని కూడా అనరు...!