పూరీ జగన్నాథ్ - జూ.ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన 'టెంపర్' బాగుందనే టాక్ వచ్చినా కూడా అనుకున్నంత కలెక్షన్ రాబట్టేలకపోయింది. చిత్రం గురించి సీనియర్ నటుడు జగపతిబాబు మాట్లాడుతూ... ఆ చిత్రానికి 45 కోట్లు షేర్ వచ్చింది.... అయినా మరో ఎనిమిది కోట్లు వచ్చి ఉండేవని అన్నాడు రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ... అదెలాగంటే... ‘‘తాను గనుక ..పోసాని కృష్ణ మురళి చేసిన పాత్ర చేసి ఉంటే, మరో ఎనిమిది కోట్లు నిశ్సందేహంగా వచ్చి ఉండే’వని అన్నారు. ఈ విషయమై ఆయన ఓ విలువైన పాయింట్ ని కూడా చెప్పారు. ‘హీరోయిజమ్... బాగా ఎలివేట్ అయ్యేదెప్పుడంటే... ఓ సీనియర్ హీరో... తారక్ లాంటి ఓ స్టార్ హీరోకు సెల్యూట్ చేసినప్పుడు’’ అన్నారు. ’‘అప్పుడు తప్పకుండా ఏడు నుంచి ఎనిమిది కోట్లు భాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టేవి’’ అన్నారు. ఈ సీనియర్ నటుడు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదనిపిస్తుంది. ఇంకా ఆయన ఆ ఇంటర్వ్యూలో తనకు తెలుగు చిత్ర పరిశ్రమ మరిన్ని ప్రత్యేకమైన ఛాలెంజింగ్ రోల్స్ ఇచ్చి వినియోగించుకోవచ్చని అన్నారు. అమితాబ్, ప్రాణ్, ప్రకాష్ రాజ్ వంటివారు చేస్తున్న పాత్రలను తాను సమర్ధవంతంగా చేయగలనని చెప్పాడు. ప్రస్తుతం జగపతి బాబు సినిమా కెరీర్ మంచి ఫాంలోనే ఉంది. హీరోలుగా చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేయలేక తప్పుకున్నవారు చాలా మందే ఉన్నారు. కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మంచి పాత్రల్లో చేస్తే ఏ నటుడిగాకైనా గుర్తింపు తప్పని సరిగా ఉంటుందనే లౌక్యమెరిగిన నటుడు జగపతి బాబు.