ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కోలీవుడ్ లో ఒకరిపై ఒకరు తిట్ల దండకాలు మొదలు పెట్టారు. మొన్నటి వరకూ ఎంతో కలిసి మెలిసి తిరిగిన వారు కూడా కుక్కలు, నక్కలు అని తిట్టుకుంటున్నారు. ఒకరికొకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో నటుడు శరత్ కుమార్, విశాల్ లు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నడిగర్ సంఘం ఎన్నికలు ఈనెల 18న జరుగనున్నాయి. ఎన్నికలకు మరో 10 రోజుల గడువే ఉన్నందువల్ల ఒకరిపై ఒకరు విమర్శలు విపరీతం అయ్యాయి. అయితే తాజాగా శరత్ కుమార్ టీం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది శరత్ కుమార్ జట్టు నుంచి నడిగర్ సంఘానికి ఉపాధ్యక పదవికీ శింబు పోటీ చేస్తున్నాడు.
ఈ సంధర్భంగా శింబు మాట్లాడుతూ విశాల్ పై చాలా ఫైర్ అయ్యాడు. ఒక కుటుంబం లాంటి నడిగర్ సంఘాన్ని విశాల్ చీల్చే ప్రయత్నం చేస్తున్నాడని, రాధా రవి విశాల్ ను కుక్క అనడం తప్పు... అతను జిత్తుల మారి నక్క అని విశాల్ ను తిట్టిపోశాడు శింబు. నడిగర్ సంఘం భవన నిర్మాణ భాధ్యతలను ఎస్.పి.ఐ సినిమాస్ సంస్థకు అప్పగించడంలో తప్పేముందని శింబు ప్రశ్నించారు.
అంతే కాకుండా నటుడు పూచి మురుగన్ నడిగర్ సంఘ భవన నిర్మాణ వ్యవహారంలో కోర్టులో వేసిన పిటీషన్‌ను వాపస్ తీసుకోవాలని చెబితే ఎందుకు వాపస్ తీసుకోలేదని, భవనాన్ని పడగొట్టినప్పుడు ఎందుకు రెస్పాండ్ అవలేదని శింబు ప్రశ్నించారు. సంఘం పక్కకే రానివారు అవినీతి, అక్రమాలు అని ఆరోపించడమా? సీనియర్ నటులు నడిగర్ సంఘం కోసం ఎంతో కృషి చేసారు. అందులో విశాల్‌కు ఏం అర్హత ఉందని నడిగర్ సంఘం వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు, అసలు ప్రశ్నించే అర్హత విశాల్ కు ఎక్కడ వుందని శింబు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే నడిగర్ సంఘం సమైక్యంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని, అందుకోసం ఎన్నికల పోటి నుంచి తప్పుకోవడానికి కూడా తాము సిద్ధమేనని శింబు చెప్పుకొచ్చారు. మరి శింబు మాటలపై విశాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.