సినిమాల నుండి రాజకీయాల్లోకి టర్న్ తీసుకున్న హీరోల్లో శివాజీ ఒకడు. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న ఈ హీరో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాటం ప్రారంభించాడు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటున్నాయని ఇది సహించేది లేదని అందుకే తాను పోరాటం చేస్తున్నానని అన్నాడు. అందులో భాగంగా ఈరోజు కృష్ణానదిలో సగం వరకు మునిగి జలదీక్ష చేస్తున్నాడు. అవసరమైమే ఆమరణ దీక్ష చేస్తానని కూడా అంటున్నాడు. అంతే కాకుండా ఈ పోరాటంలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొనాలని పిలుపునిచ్చాడు. మరి పవన్ కల్యాణ్ స్పందిస్తాడంటారా?