‘ఉలవచారు బిర్యాని’ చిత్రంలో అలరించిన యంగ్ హీరో తేజస్ కంచర్ల హీరోగా ప్రముఖ రచయిత వి.ఎస్.పి తెన్నేటి సమర్పణలో వెంకటేష్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘కేటుగాడు’. పలు షార్ట్ ఫిలింస్ లో నటించిన బ్యూటీ డాల్ చాందిని చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కిట్టు నల్లూరి దర్శకుడు. వెంకటేష్ బాలసాని నిర్మాత. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జూలై 26న హైదరాబాద్‌లో జరిగింది. థియేట్రికల్ ట్రైలర్‌ను విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ విడుదల చేశారు. బిగ్ సీడీని ప్రముఖ నిర్మాత కె.యస్.రామారావు ఆవిష్కరించారు. ఆడియో సీడీలను కె.యస్.రామారావు ఆవిష్కరించి ప్రకాష్ రాజ్‌కి తొలి సీడీని అందించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ తేజస్ గురించి మాట్లాడుతూ తేజస్ లో మంచి నటనతో పాటు ఎదగాలన్న కసి బాగా ఉందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తేజస్ డైరెక్షన్ టీమ్‌లో వర్క్ చేసినందువల్ల తనకి నటన గురించి మంచి అవగాహన వుందని అన్నారు. ఉలవచారు బిర్యాని ఆడిషన్ చేస్తున్నప్పుడు కె.యస్.రామారావు సలహా మేర తనని ఆడిషన్ చేశాను. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో జె.వి.మోహన్‌గౌడ్, సుశాంత్, ఆర్.పి.పట్నాయక్, ప్రతాని రామకృష్ణగౌడ్, బాలభాను, సప్తగిరి, అజయ్, మల్కాపురం శివకుమార్, మారుతి, గొట్టిముక్కల పద్మారావు తదితరులు పాల్గొని ఆడియో, సినిమా పెద్ద హిట్ కావాలని యూనిట్ ను అభినందించారు. అజయ్, సుమన్, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, సప్తగిరి, సోఫియా, రఘు కారుమంచి, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్ జోషి, సాహిత్యం: భాషా శ్రీ, బాలాజీ, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సుబ్బరాయ శర్మ, యాక్షన్: నందు, డ్యాన్స్: సాయిరాజ్, ఎడిటర్: పశుమ్ వి.రావ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అచ్చిబాబు.యం., సంపత్‌కుమార్, నిర్మాత: వెంకటేష్ బాలసాని , కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిట్టు నల్లూరి.