విశాల్ కు గాయాలు

November 28, 2014 | 05:12 PM | 54 Views
ప్రింట్ కామెంట్

విశాల్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ఆంబల’ షూటింగ్ ఊటీలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ జరిగి తీవ్రంగా గాయపడ్డాడు విశాల్. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా రక్షణ కోసం ఉపయోగించే వైర్లు తెగి అమాంతం కిందపడిపోయాడు. అక్కడే ఉన్న సిబ్బంది అతన్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పెద్ద ప్రమాదం తప్పింది. విశాల్ పరిస్థితి ఇప్పుడు మెరుగ్గానే ఉంది. కానీ అక్కడ ఉన్న సిబ్బంది మాత్రం ప్రమాదం చాలా పెద్దదే అని చెప్పుకుంటున్నారు. కొద్దిరోజులు విశ్రాంతి అవసరమవుతుందని అనుకుంటున్నారు. సుందర్ .సి డైరెక్షన్‌లో రానున్న ‘ఆంబల’లో విశాల్ సరసన హన్సిక హీరోయిన్. విశాల్ గాయపడడంతో అనుకున్న సమయానికి ఈ చిత్రం రిలీజ్ కావడం కష్టమేనని సినీ వర్గల్లో చర్చించుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ