సంపాదనే ధ్యేయంగా రకరకాల బిజినెస్ లు చేస్తూ జనాలకు టోపీ పెట్టేస్తున్న రోజులివి. ఈ హీరోయిన్ కి మాత్రం టోపీ కాదు గానీ, గుండు చేశారట ఓ సెలూన్ వారు. ఆశ్చర్యంగా ఉంది కదూ... నిజమే నండీ... సెలబ్రిటీలకూ, సామాన్య జనానికి కూడా అందం పెంచుకోవాలనే ఆతృత ఎక్కువ కదా... ఈ వీక్నెస్ తో క్యాష్ చేసుకోవడం తేలిక. అందుకే బొటిక్ లు, బ్యూటీ క్లినిక్ లు, సెలూన్లూ... గల్లీ కొకటి వెలుస్తున్న రోజులివి. దీంతో టోపీలు పెట్టుకోవడమే కాదు గుండ్లూ గీయించుకుంటున్నారు. ఈ హీరోయిన్ కూడా ఓ సెలూన్ ప్రమోషన్ కార్యక్రమానికి వెళ్ళిందట. వారిచ్చిన ఉచిత ఆఫర్లు వినియోగించుకుందామనుకుందట. ఒక సిట్టింగ్ అయిపోయింది... రెండో సిట్టింగ్ అయిపోయింది... గుండు కూడా అవడం మొదలయ్యిందట. భయపడిపోయిన సదరు హీరోయిన్ ఆ సెలూర్ వారికి కంప్లయింట్ చేసిందట. వారు పట్టించుకుంటే0గా... నోరు నొప్పెట్టేలా వారి మీద అరిచి, ఇక లాభం లేదని సోషల్ నెట్వర్క్ లో జనాల్ని జాగృతం చేస్తోందిప్పుడు.... ఇలాంటి సెలూన్లనూ, క్లినిక్ లను నమ్మొద్దంటూ... ఇంతకూ ఎవరీ హీరోయిన్ అనుకుంటున్నారు కదా... అస్మిత సూద్... తెలుగు వారికి అంతగా తెలియదు లెండి... ఆవిడ తెలుగులో నటించిన సినిమాలు బ్రహ్మిగాడి కథ, ఆడు మగాడ్రా బుజ్జి అనే ఫ్లాప్ చిత్రాలు. ఇప్పుడు కన్నడ సినిమాల్లో బిజీగా ఉందట ఈ అమ్మడు.