మొత్తం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చే వార్త ఒకటి ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. దానికి కారణం స్టార్ డైరక్టర్, ఇండియన్ స్పీల్ బర్గ్ శంకర్. రోబో తర్వాత హిట్ కు దూరమైన శంకర్ ఇండియన్ చలనచిత్ర రికార్డులను తిరగరాయాలనే ఉద్దేశ్యంతో దాని సీక్వెల్ ను రూపొందించాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే భారీ బడ్జెట్ అందించేందుకు పలువురు ప్రొడ్యూసర్ లు ముందుకు వచ్చారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్ట్ కు ప్రపంచ దృష్టి పడేలా చేయాలని హాలీవుడ్ స్టార్ అర్నాల్డ్ ను నటింపజేయాలని, అందుకోసం ఆయనకు 200 కోట్లు రెమ్యునరేషన్ కూడా ఇవ్వాలని చిత్ర యూనిట్ సిద్ధపడింది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిత్రం నుంచి అర్నాల్డ్ ఆల్ మోస్ట్ అవుట్ అయినట్లే తెలుస్తోంది. కీలకమైన విలన్ పాత్ర నుంచి ఆయనను తప్పిస్తే ఎవరినీ తీసుకుంటారనేగా మీ అనుమానం. అందుకోసం బాలీవుడ్ కండలవీరుడు హృతిక్ రోషన్ ను చిత్ర యూనిట్ సంప్రదిస్తోందట. ధూమ్ 2 లో మిస్టర్A గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించిన హృతిక్ రోబో-2 కి గనక ఓకే అంటే మాత్రం ఆ పాత్రకి మరింత ఇంపార్టెంట్ దొరకటం మాత్రం ఖాయం. అంతేకాదు హృతిక్ సౌత్ లో నటించే మొదటి సినిమా ఇదే అవుతుంది. హృతిక్ కి బాలీవుడ్ తోపాటు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రేజ్ ఉంది. దీంతో హృతిక్ ను అల్టర్ నేట్ గా ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో శంకర్ ఉన్నాడు. ఎవరో ఒకరు ఓకే అయితేనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేది. చూస్తుంటే శంకర్ ఈ చిత్రం ద్వారా ఇచ్చే షాకులు మాములుగా ఉండబోవన్నది మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.