నేను రోబోను కాను: రేణు దేశాయ్

January 05, 2015 | 03:13 PM | 73 Views
ప్రింట్ కామెంట్

ఒక హీరోకు ఉన్న క్రేజ్ హీరోయిన్ కు ఉండదు. హీరోలు సంవత్సరాల తరబడి సినిమాల్లో స్థిరపడి పోతారు. హీరోయిన్ 10 సంవత్సరాలు స్టార్ గా ఉంటే చాలా గొప్ప. ఒక హీరో తన తనయుడ్ని ఫీల్డ్ కు పరిచయం చేస్తే ఈలలు, మరి హీరోయిన్ పరిచయం చేస్తే విమర్శలు? ఎంత స్పష్టంగా కనిపిస్తుంది డిస్ర్కిమినేషన్. ఏ కారణం వల్లనో రేణు దేశాయ్, పవన్ విడిపోయారు. ఆమె పవన్ కు దూరంగా పూణెలో ఉంటోంది. ఆమె పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా ఎప్పుడూ మాట్లాడలేదు. పవన్ గురించి పొగిడినా కూడా విమర్శగానే చిత్రీకరిస్తున్నారు జనాలు. బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించిన అడిగిన ప్రశ్నల విషయంలో తాను ఇచ్చిన సమాధానాలను కొందరు మరో రకంగా అర్థం చేసుకున్నారని రేణు దేశాయ్ బాధపడింది. ఆమె ట్విట్టర్లో పవన్ ని పొగిడినా, తన ఇమేజ్ ను పెంచుకోడానికి ఇలా చేస్తుందనీ, దగ్గర కావాలని చూస్తుందనీ రకరకాల కామెంట్లు వినిపించాయి. ఈ విమర్శలపై రేణు దేశాయ్ ఘాటుగా స్పందించింది. ‘నా కూతురు ఆద్య గురించి కవిత రాసినా, అది పవన్ కోసం రాసిం’దంటూ ఆయనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఊహించుకుంటున్నారని, తాను చేసే ప్రతి ట్వీట్ పవన్ కోసం కాదనీ, ఆయన పేరు ప్రస్తావిస్తే ఆయన పేరు వాడుకున్నట్లు అవుతుందా? అని ఓ ప్రముఖ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు రేణు దేశాయ్. అయితే ఎవరో చేసే విమర్శలకు నేను స్పందించను. నాకంటూ మనసు ఉంది. నేను రోబోను కాదు. తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందనీ, ఆలోచనలు ఉన్నాయని, నిర్మాతగా, దర్శకురాలిగా, నటిగా వివిధ రంగాల్లోనూ తనకు అనుభవం ఉందని ఇకనైనా తన గురించి మాట్లాడడం మానుకోవాలని ఆమె కోరారు. పవన్‌కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న ఆమె ప్రస్తుతం తన పిల్లలతో కలిసి పూణేలో నివాసం ఉంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ