ఫైనాన్సియల్ సమస్యల కారణంగా ఐ మూవీని నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు ‘ఐ' స్టే విధించిన సంగతి తెలిసిందే. మూడు వారాల వరకు సినిమాను విడుదల చేయడానికి వీల్లేదంటూ హై కోర్టు ఆర్డర్ వేసింది. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జనవరి 14న విడుదల చేస్తానంటున్నారు. ఈ సమస్యను త్వరలో కోర్టు బయట సెటిల్ చేసుకుంటాం. ముందుగా ప్రకటించిన ప్రకారమే సినిమాను విడుదల చేస్తానని మీడియాతో చెప్పారు. మరి సినిమాను విడుదల చేయడంలో నిర్మాత ఏమేరకు సక్సెస్ అవుతాడో చూడాలి. ఈ స్టే రావటానికి కారణం ఓ పివిపి సంస్ద అధినేత ప్రసాద్ వి పొట్లూరి. ఆయన నిర్మాతగానే కాకుండా పెద్ద సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ భారీ చిత్రానికి ఫైనాన్స్ చేసారని, దాంతో ఆ ఫైనాన్స్ ని క్లియర్ చేయమని కోర్టుకు ఎక్కారని చెప్పుకుంటున్నారు. సిని పరిశ్రమ నిబంధనల మేరకు రిలీజ్ కు ముందే ఫైనాన్స్ లు అన్ని క్లియర్ చెయ్యాలి. దాంతో తమ వద్ద నుంచి తీసుకున్న మొత్తం క్లియర్ చెయ్యకుండా రిలీజ్ చేయటానికి వీల్లేదని పివిపి సంస్ద చెప్పి కోర్టుకు ఎక్కిందని, దాని పర్యవసానమే ఇదంతా అని చెప్పుకుంటున్నారు. ఈ సెటిల్ మెంట్ కూల్ జరిగితే ఐ సినిమా సంక్రాంతికి చూసే వీలు కలుగుతుందని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.