గట్స్ ఉన్న నటుడిగా తెలుగులో క్రుష్ణకు మంచి పేరు. డబ్బు విషయంలో ఆచీ తూచీ ఆలోచించి ఖర్చు చేయడం ఆయనకు తెలియదు. అందుకే ఏదైతే అదైందని అని... సినిమా కోసం ఎన్నో ప్రయోగాలు చేశారు. కధానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనను తారూ నిరూపించుకోడమే కాక హైదరాబాద్లో పద్మాలయ స్టూడియోస్ నిర్మించి అదే పేరుతో సొంత నిర్మాణ సంస్థను కూడా నడిపారు. మరి ఆయన వారసుడు ఇప్పటి వరకూ సినిమాలు చేయడమే తప్ప మరి దేంట్లోనూ తల దూర్చలేదు. కానీ ఇప్పుడు తను కూడా సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఒక టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. మహేష్ కు అభిరుచికి తగిన సినిమాల నిర్మాణం ఈ బేనర్లో నిర్మించాలనుకుంటున్నారనీ, కొన్ని రోజుల క్రితం నుంచే మహేష్ ఈ ఆలోచన చేస్తున్నట్లు అనుకుంటున్నారు. ఈ నెల 31న క్రిష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సొంత బేనర్ ను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నటుల కొన్ని సినిమాలు అటు ఇటుగా వారసులు మళ్ళీ చేసిన దాఖలాలు గతంలో ఉన్నాయి. మరి... క్రిష్ణ గారి బ్లాక్ బస్టర్స్ ఏమైనా మళ్ళీ నిర్మించే ఆలోచన మహేష్ ఏమైనా చేస్తాడా... తన సొంత బేనర్ లో మహేష్ నుంచి ఎలాంటి చిత్రాలను ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేయవచ్చు... అంతా సస్పెన్సే...