పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తీస్తున్న చిరంజీవి 150 సినిమా గురించి అందరిలోనూ ఉత్కంఠ కనిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీలోనే ఈ సినిమా కథ ఏమిటనే చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు నిర్మాత రాంచరణ్ అనేది ముందుగానే ప్రకటించిన అంశం. అయితే ఈ సినిమాలో తానూ నటించాలనే కోరికతో రాంచరణ్ ఉన్నట్టు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే రాంచరణ్ డెబ్యూ మూవీ తీశారు. ఇప్పుడు తెరకెక్కుతున్న చిరు 150వ సినిమాలో ఈ చిరుత ఉంటాడా లేదా అనే సస్సెన్స్ కొనసాగుతోంది. ఇటీవల కుటుంబంతో తీసిన కుటుంబ సమేతంగా చూసే సినిమాలకు బాగా క్రేజ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తండ్రీ, తనయుడు కలిసి నటించే సినిమా అంటే అభిమానులు ఎగబడి పోతారు. మరి ఈ సినిమాలో తనయుడు కూడా నటిస్తాడా లేదా అనేది సస్సెన్స్. ిటీవల తీస్తున్న సినిమాల కథలు గానీ, నటీనటులు గానీ ఏ మాత్రం బయటకు రానీకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. సినిమా రిలీజ్ అయ్యేవంత వరకూ ఈ విషయాలను గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ఆ యూనిట్ అందరిపైనా ఉంటుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన మరొక వార్త ఏమిటంటే చార్మి కూడా ఈ సినిమాలో ఓ డాన్స్ చేస్తుందనేది. ఈమె కూడా పూరీ జగన్నాథ్ తో ఓ సినిమా చేసి చాలా క్లోజ్ అయినందున ఆమె ఈ సినిమాలో ఓ డాన్స్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా వినోదాత్మకంగా రూపొందుతున్నద కావడం వల్ల చార్మి చేయడానికి కూడా అవకాశం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రంలో వీరిద్దరికీ అవకాశం ఉంటుందో లేదో వేచి చూడాల్సిందే... పూరీ సినిమా అంటే ఇలా షూటింగ్ మొదలై అలా విడుదలైపోతుంది కాబట్టి... సస్పెన్స్ ఎక్కువ రోజులు భరించాల్సిన అవసరం లేదు అభిమానులకు.