కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి కానీ, ఎందుకు ఫ్లాపవుతాయో అర్థం కాదు. టీవీలో కొన్ని పాత సినిమాలు చూస్తుంటాం... ఆ సినిమా ఒకప్పుడు ఫ్లాప్ మూవీగా రికార్డులో ఉంటుంది. బాగుంది కదా...ఎందుకు ఫ్లామ్ అనుకుంటాం... హిట్ అయిన చిత్రాలు కూడా అంతే... ఏముంది ఇందులో... ఈ సినిమాకు ఎందుకింత కలెక్షన్ అని కూడా అనుకోవచ్చు. అన్నీ బావున్నా అప్పటి పరిస్థితులను బట్టి కూడా కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. అయితే మెగా నిర్మాత అశ్వనీదత్ పాతికేళ్ల క్రితం తను నిర్మించిన చిత్రం మరో సారి గుర్తుచేసుకుంటూ ఆ విషయాల్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఆయన సినిమా జగదేకవీరుడు-అతిలోక సుందరిని రిలీజైనప్పుడు ఫ్లాఫ్ అన్నారని, తర్వాత అది సునామీ తరహా కలెక్షన్స్ తో దుమ్ము రేపిందని చెప్పుకొచ్చారు. ఈ రోజుతో ఆ సినిమా రిలీజై పాతికేళ్లు పూర్తైన సందర్భంగా...ఆయన ఇలా స్పందించారు. రిలీజైన రోజు..ఆంధ్రాలో సైక్లోన్. అంతా మా సినిమా సూపర్ ఫ్లాప్ అన్నారు. అయితే కొద్దిరోజులు గడిచింది. సినిమా సునామీ తరహా కలెక్షన్స్ తో దుమ్ము రేపింది. ధాంక్స్ టు మెగా ఫాన్స్ ", అన్నారాయన. అలాగే ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం 1990 మే 9న విడుదలైంది. ఈ చిత్రం తెలుగునాట ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. విడుదలై 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం నటీనటులు, సాంకేతిక నిపుణులు ముఖ్యంగా చిత్ర ఛాయాగ్రాహకుడు అజయ్ విన్సెంట్, సంగీత దర్శకుడు ఇళయారాజా అందించిన పాటలు చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఇప్పటికీ సినిమాల్లోనూ ఈ పాటలను ఏదో ఒక సందర్భంలో ఉపయోగించుకుంటున్నారు.