వైభవంగా జగపతి బాబు కుమార్తె వివాహం

March 09, 2015 | 03:39 PM | 81 Views
ప్రింట్ కామెంట్
Jagapati_Babu_meghana_marriage_niharonline

ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు పెద్ద కుమార్తె మేఘన వివాహం ఒక ఎన్నారైతో వివాహం జరిగింది. హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్ లో పలువురు ప్రముఖులు హాజరుకాగా ఈ వివాహం చాలా వైభవంగా జరిగింది. అమెరికాలో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేసిన మేఘన అక్కడి ఎన్నారైతో ప్రేమలో పడింది. తండ్రి జగపతి బాబు అనుమతి తీసుకుని వారి అంగీకారంతోనే ఈ వివాహం చేసుకుంది. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు అనేక మంది హాజరయ్యారు. పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా ఈ వివాహం జరిపించారు. వివాహానంతరం మీడియాకు ఫొటోలు విడుదల చేస్తామని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన ‘సంగీత్’ కార్యక్రమానికి జగపతిబాబు స్నేహితుడు, సినీనటుడు అర్జున్ తో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ