ఇషాంత్ వర్మ సమర్పణలో యాపిల్ సినిమా బ్యానర్‌పై నిర్మాత మనెగుంట కార్తీక్ రెడ్డి...కృష్ణవర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త, శేఖర్, దిలీప్ మొదలగు వారు తారాగణం. ఈ చిత్రం మలేషియాలో దిగ్విజయంగా 40 రోజుల పాటు షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణవర్మ చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గొప్ప దర్శకులైన జంధ్యాల గారు రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. ప్రజంట్ ట్రెండ్‌కి అనుగుణంగా, అన్ని కమర్షియల్ హంగులతో..అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాము. షూటింగ్ చివరి దశలో ఉంది. మలేషియాలో 40 రోజుల పాటు ఏకధాటిగా సక్సెస్‌ఫుల్‌గా షూటింగ్ పూర్తిచేశాం. మరో వారం రోజుల పాటు హైద్రాబాద్‌లో జరిగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. చిత్రీకరణ అనంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా పూర్తిచేసి అతి త్వరలోనే చిత్రాన్ని విడుదలకు రెడీ చేస్తాము..’ అని అన్నారు.
శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త, శేఖర్, దిలీప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నబాబు,
సంగీతం: గోపీ, ఎడిటింగ్: నరసింహారెడ్డి, సహనిర్మాతలు: కోశిరెడ్డి రవికుమార్, పసుపులేటి సురేష్‌బాబు, నిర్మాత: మనెగుంట కార్తీక్‌రెడ్డి, దర్శకత్వం: కృష్ణవర్మ.