హాసిని రీ ఎంట్రీ అమ్మాయిగానా? అమ్మగానా?

February 26, 2015 | 03:59 PM | 37 Views
ప్రింట్ కామెంట్
genelia_niharonline

బుంగమూతితో గారాలు పోతూ అమాయకత్వంతో యువకుల మనసు దోచేసిన చిరునవ్వుల హాసిని (జెనీ లియా), సినిమా ఛాన్సులన్నీ వదిలేసుకొని మూడుముళ్ళ బంధంతో తెరవెనక్కు వెళ్ళిపోయింది. నటుడు, మహారాష్ట్ర సి.ఎం విలాస్ రావు దేశ్ ముఖ్ కుమారుడు రితేష్ దేశ్ముఖ్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఇప్పుడో బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ఆ మధ్య రితేష్ తన బాబు ఫొటోను ట్విట్టర్ షేర్ చేసి తెగ ఆనంద పడిపోయాడు కూడా. ఇప్పుడు జెనీలియా బిడ్డ , భర్త తోడిదే జీవితంగా, మంచి ఇల్లాలిననిపించుకుంటోంది. అయితే తను ఇక పూర్తిగా తెర వెనక్కు వెళ్ళిపోయినట్టేనా? అనుకుంటూ బాధ పడుతున్నారు కొందరభిమానులు. జెనీలియా అదృష్టం ఏమిటంటే ఇప్పటికీ ఓ పదహారేళ్ళ అమ్మాయిలాగానే కనిపిస్తుంది. హీరోయిన్ గా నటించినా, ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారనడంలో సందేహం లేదు. అయితే ఈ అమ్మడు ఈ మధ్య ఓ సినిమా ప్రమోషన్ ఫంక్షన్లో కనిపించి, కొందరడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ‘పెళ్ళి వల్ల గ్యాప్ వచ్చిన మాట నిజమే కానీ పూర్తిగా సినిమాను వదిలిపెట్టలేదు, మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాను’ అందట. ఇప్పటికీ తెలుగు నాట ఎంతో మంది అభిమానులున్నారు జెనీలియాకు. తెలుగులో ఎక్కువ సినిమాలు చేసి మాంచి రెమ్యునరేషన్ దండుకున్న ఈ అమ్మడు, సీసీఎల్ మ్యాచుల్లో మాత్రం మహారాష్ట్ర, ముంబయి టీములకు జేజేలు కొడుతూ ఎంజాయ్ చేస్తుంది. ఇంతకూ అభిమానులకు రీ ఎంట్రీతో తిరిగి చేరువవుతానని జెనీలియా భావించినా, ఈమెను సినీ ప్రొడ్యూసర్లు అమ్మాయిగా ఆహ్వానిస్తారా? లేక అమ్మగానా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ