టెంపర్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ కిక్క్ తో యమ ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. హిట్ అనే పదానికి దూరమైన తమ హీరోకి సాలిడ్ హిట్ పడటంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అంతు లేకండా పోయింది. అయితే ఈ సక్సెస్ ను అంతగా పట్టించుకోని ఎన్టీఆర్ వెంటనే తన నెక్స్ ట్ ప్రాజెక్టుపై కాన్ సన్ ట్రేషన్ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా ఓ చిత్రం చేయనున్న సంగతి విదితమే. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ చిత్రం షూటింగ్ ను ఈ నెలలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ విషయంపై ఓ వార్త అందింది. ఈ చిత్రానికి ‘దండయాత్ర’ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే సమాచారం. టెంపర్ లో దయాగాడి ‘దండయాత్ర’ అనే టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో దీనినే తన నెక్స్ట్ చిత్రానికి టైటిల్ గా కన్ఫర్మ్ చేయాలని జూనియర్ చిత్ర యూనిట్ కి సలహా ఇచ్చాడట. ఇక కొంత మంది ఏమో టైటిల్ విషయం అప్పుడే తేలేది కాదని, దానికి ఇంకా సమయం పడుతుందని మరి కొందరు అంటున్నారు. ఈ మధ్య ఇలాంటి గాసిప్ వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి. అందుకే అధికారిక ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే కదా.