జూనియర్ ఎన్టీఆర్-రాజీవ్ కనకాల చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం కొన్ని ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్ చెప్పుకున్నాడు. ఈ ఇద్దరూ కలిసి స్టూడెంట్ నెంబర్1 లో కలిసి నటించారు. ఆ తరువాత కూడా చాలా సినిమాల్లో కలిసి కనిపించారు. కానీ ఎందువల్లో ఇటీవల ఈ ఇద్దరూ కలిసి కనిపించి చాలా రోజులైంది. యమదొంగ సినిమా తరువాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఎక్కడా కనిపించలేదు. ఎవరి ప్రొఫెషన్ లో వారు బిజీగా ఉన్నారనుకుంటే, రాజీవ్‌కు ఈ మధ్య సినిమాలవల్ల గానీ, టీవీ షోల వల్ల గానీ అంత బిజీ ఏమీ లేదనే చెప్పాలి. వీరిద్దరి మధ్య గ్యాప్ కాకతాళీయమే అనుకున్నా ఇండస్ట్రీలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక మసాలా టాపిక్ ఉండాలి కాబట్టి, వీరిద్దరికీ ఏదో పొరపొచ్చాలు వచ్చాయనే టాపిక్ నడిచింది. కానీ జూనియర్ తాజా సినిమా 'నాన్నకు ప్రేమతో' ద్వారా మళ్లీ వీరు దగ్గరయ్యారు అంటున్నారు. ఈ సినిమాలో రాజీవ్ కోసం ప్రత్యేకంగా ఓ పాత్రను క్రియేట్ చేసి ఇచ్చినట్లు సమాచారం. కథ పరంగా ఆ సీన్ లో రాజీవ్ కనకాల అయితేనే బాగుంటాడని జూనియర్ సూచించడంతో ఆ పాత్రకు రాజీవ్ ను తీసుకున్నారట. దీంతో ఇప్పటివరకూ నడుస్తున్న చర్చలకు బ్రేక్ పడినట్టయ్యింది.