మహేష్ బాబు నటించిన శ్రీమంతుడుకు ప్రశంసల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఓ సోషల్ యాస్పెక్ట్ తో వచ్చిన సినిమాలకు ఇంతటి అపూర్వ స్పందన రావడం అనేది జరగలేదు. సామాజిక స్పృహతో వచ్చిన సినిమాలెన్నో ఉన్నాయి. కానీ రాజకీయ నాయకుల ప్రశంసలు కూడా అందుకున్న సినిమా శ్రీమంతుడు. విడుదలై ఇన్ని రోజులైనా ఏదో ఒక కారణంతె వార్తల్లో కనిపిస్తూనే ఉంది. ఒక స్టార్ హీరో ఇలాంటి స్క్రిప్ట్ చేయడం అద్భుతమని కొన్నాళ్ళ క్రితం రామ్ చరణ్ తేజ్ పొగిడేశాడు. ఇప్పుడు ఈ సినిమాని చూసి జూనియర్ ఎన్టీఆర్ ఫిదా అయిపోయిన మహేష్ ను కలిసి పొగిడేశాడట.
ఇంత మంచి చిత్రంలో నటించినందుకు మహేష్ కి తారక్ ప్రత్యేకంగా కృతఙ్ఞతలు సైతం తెలిపాడట. అంతేకాక తన ప్రస్తుత సినిమా నాన్నకు ప్రేమతో షూటింగ్ విశేషాల గురించి కూడా చాలా సేపు మాట్లాడినట్టు సమాచారం. ఇదంతా చూస్తుంటే ఒక పక్క తెలుగు హీరోల మధ్య సంబంధ బాంధవ్యాలు చాలా బాగా ఉన్నట్టు అనిపిస్తోంది. మరో పక్క సీనియర్ సినీ కుటుంబాలు రెండిటి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మధ్య అఖిల్ ఆడియో ఫంక్షన్ లో కూడా ఫాన్స్ అఖిల్ నొచ్చుకునే విధంగా ఇంకొక హీరోకు జై కొట్టడం చూస్తుంటే... ఈ సీనియర్ల మధ్య స్పర్థలు ఎందుకు వచ్చాయో అర్థం కాక అభిమానులు అయోమయంలో ఉన్నారు.