ఇప్పటి వరకూ పెద్ద పెద్ద డైరెక్టర్లతో మాత్రమే చేసిన రజనీ కాంత్ ఓ చిన్న డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మద్రాసి, అత్త కత్తి లాంటి భారీ హిట్స్ ఇచ్చిన రెండు సినిమాల అనుభవమున్న రంజిత్ అనే యువ దర్శకుడు ఇప్పుడు రజనీ కాంత్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. కబాలి టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. తెలుగులో ఈ సినిమా కపాలి పేరుతో వస్తుందంటున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ ఓ పెద్ద వయస్కుడి పాత్రలో చేస్తున్నాడు. ఈ సినిమాలో రజినీ పక్కన రాధికా ఆప్టే హీరోయిన్గా నటిస్తోంది. మలేసియా, హాంగ్ కాంగ్, చెన్నైలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోబోతోంది. కొచ్చడయాన్,లింగా ప్లాప్‌లతో విసిగిపోయిన రజినీ చాలా ఆలోచించి ఈ చిన్న డైరెక్టర్ తో పని చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మలేషియాలో మగ్గుతున్న తమిళ కూలీల కోసం చెన్నై నుంచి అక్కడికి వెళ్లి వారిని కాపాడే పాత్రలో కనిపించబోతున్నాడట రజినీ. అంతకు ముందులా రాజినీ మార్క్ హీరోయిజం ఇందులో కనిపించదని చెపుతున్నారు. రంజిత్ అంతకు ముందు సినిమాల్లాగానే సినిమా టేకింగ్ సహజంగా ఉండబోతోందని తమిళనాట టాక్.