ఒకప్పుడు ఆమె అంటే కుర్రకారు చొంగ కార్చుకునే వారు. ఆమె సినిమా వస్తే చాలు చొక్కాలు చించుకుని మరీ టిక్కెట్లు కొనుక్కుని చూసేదాకా వదిలేవారు కాదు. అలాంటిది ఆమెకు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది. ఇదంతా చందమామ కాజల్ అగర్వాల్ గురించి. నటనతోపాటు అందంతో కూడా సెగలు పుట్టించింది. కానీ ఓడలు బండ్లయ్యాయి. కోలీవుడ్ సంగతి పక్కన బెడితే టాలీవుడ్ లో ఇప్పుడామె ఛాన్సులు లేకుండా అయిపోయింది. ప్రస్తుతం సర్దార్ కు ఎంపికైందని వార్తలు వినిపించినప్పటికీ అది అనుమానమే అని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
శ్రుతి హాసన్, సమంత, ఇంకా బాలీవుడ్ కుర్ర హీరోయిన్లు వలస భారీగా ఉండటంతో కాజల్ ఛాన్సులకు గండిపడింది. ఐతే మరికొందరు మాత్రం వేరే లెక్క చెపుతున్నారు. కాజల్ గ్లామర్ పరంగా డల్ అయిపోయిందని. ఇంతకు ముందులా ఆమె లో వెలుగుల జిలుగులు లేకుండా పోయాయని వారంటున్నారు. టెంపర్ తో హిట్ కొట్టినప్పటికీ అందులో కాజల్ గ్లామర్ పెద్దగా పనికి రాలేదని ప్రేక్షకులు పెదవి విరిచారు. సుమారు అగ్ర హీరోలందరితో నటించిన ఈ భామకు ఇప్పుడు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. పోనీ అడపాదడపా పంక్షన్లలో, ఆడియో వేడుకల్లో గ్లామర్ ను ఓ రేంజ్ లో ఒలకబోసిన చూసేవారే కరువయ్యారు. ఎంత హాట్ గా తయారయినప్పటికీ వయస్సు మూడు పదుల్లో పడిపోవటంతోపాటు దేహశిరుల్లో మునుపటి వెలుగులు లేకపోవటంతో కాజల్ కు ఆపర్లు మొత్తానికే లేకుండా పోతున్నాయ్. ఇది తెలిసీ కూడా కాజల్ నేను ఎక్స్ పోజింగ్ కు దూరం కాలేదంటూ ఎంత చూపించినా వేస్టే !