అవంటే కాజల్ కు భయమట!

January 27, 2015 | 04:15 PM | 40 Views
ప్రింట్ కామెంట్

మీరిది నమ్ముతారా? కాజల్ అగర్వాల్ కు పక్షులంటే భయమట. అందమైన పక్షుల్ని చూస్తే చేత్తో పట్టుకుని కబుర్లాడాలనిపిస్తుంది. కానీ నిజంగానే వాటిని చూస్తే భయమట కాజల్ కు. ఈ అమ్మడు పక్షుల భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నాన్ని తన రాబోయే తమిళ సినిమా ‘మారీ’లో చేయాల్సి వచ్చిందట. ఎందుకంటే తన ఫస్ట్ షాట్ వాటితోనే కాబట్టి. పక్షుల గుంపు మధ్య కాజల్ పరుగెత్తే షాట్ ఇది. ఆమెకు అవంటే భయం ముఖ్యంగా పావురాలంటే మరీ భయమట. ఈ షాట్ కోసం భయం పోవాలంటే వాటితో కాస్త చెలిమి చేయాల్సి వచ్చింది ఈవిడకు. పావురాన్ని చేత్తో పట్టుకున్న తరువాత భయం కాస్త పోయిందట ఈ అమ్మడికి. ఇలా తన మనసులో ఉన్న భయాన్ని బయటపెట్టింది కాజల్. ఈ చిత్రంలో ధనుష్ తో జతకడుతోంది ఈ అమ్మడు. తను ఇంతకుముందే ‘పొల్లదవన్’ అనే చిత్రంలో ధనుష్ తో నటించే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ చిత్రం కోసం ఒక ఫొటో షూట్ కూడా చేసిందట. కానీ ఆ సమయంలో తెలుగు సినిమా చందమామ కాల్షీట్స్ కారణంగా ఈ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చిందట. అలా ధనుష్ తో హీరోయిన్ గా నటించే ఛాన్సు వదులుకున్న ఈ భామ ఇప్పుడు ‘మారీ’ చిత్రంలో తిరిగి నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ