‘ముకుంద’ ఆడియోలో పవన్, చరణ్ మిస్సింగ్

December 06, 2014 | 03:19 PM | 18 Views
ప్రింట్ కామెంట్

ఆయన రాకపోతేనేమి ఆయన పేరు మాత్రం మొదటి నుంచి చివరిదాకా వినిపిస్తూనే ఉంది. నాగబాబు తనయుడు వరుణ్ తేజ ముకుందు ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది.వరుణ్ తేజ్ కు ఇది తొలిసినిమా. మెగా ఫామిలీ ఫంక్షన్ కావడంతో, అక్కడికి వచ్చిన అభిమానులంతా మధ్య మధ్యలో పవర్ స్టార్ నామస్మరణ చేస్తూనే ఉన్నారు. వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆడిటోరియం అంతా కేకలతో మారుమ్రోగిపోయింది. ‘‘బాబాయి గోపాల గోపాల షూటింగ్‌లో వారణాసిలో ఉండడం వల్ల రాలేకపోయారు. ఆయన ఆశీస్సులు నాకు ఉన్నాయి. నాకు ఆయన ఫోన్ చేసి ఆల్ ద బెస్ట్ కూడా చెప్పా’’ రని వరుణ్ అన్నాడు. తరువాత పెదనాన్న గురించి మాట్లాడాడు. ‘‘ఇప్పుడు మీ ముందు నేనిలా నిలబడి మాట్లాడుతున్నానంటే అందుకు కారణం మా పెదనాన్న చిరంజీవే. ఆయన 1978లో ఇక్కడ అడుగుపెట్టి.. ఎవరి సపోర్ట్ లేకుండా అంచెలంచెలుగా కష్టపడి ఎదిగి.. మెగా స్టార్ అయ్యారు. మాకందరికీ ఆదర్శం ఆయనే. మా నాన్న అయినా, బాబాయి పవన్ కళ్యాణ్ అయినా.. చరణ్, బన్నీ, తేజ్ అయినా.. నేనైనా ఇలా ఉన్నామంటే ఆయన వేసిన బేసే కారణం. మాకు అండగా నిలుస్తున్న అభిమాన దేవుళ్లకు కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా’’ అని అన్నాడు. తరువాత చిరంజీవి మాట్లాడుతూ కళ్యాణ్‌కు తమ కుటుంబానికి చెందిన వేడుకల్లో వచ్చి పాల్గొనేందుకు తగిన తీరిక, సమయం లేదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అందువల్ల అతని విషయం వదిలివేయాలని మెగా అభిమానులకు సూచించారు. పైగా, పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నాడని, వాడికి వచ్చేటంతటి తీరిక లేదన్నారు. అయినా అభిమానులు అరుపులు మిన్నంటుతుండడంతో. చివరికి చిరంజీవి ’వదిలెయ్యండి ప్లీజ్‘అని రిక్వెస్ట్ చేశాడు. ఇక నాగబాబు తనయుడికి ఇది మొదటి సినిమా ఫంక్షన్ కావడంతో కాస్త ఎమోషన్ కు గురయ్యాడు. ఆయన ఈ కార్యక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కాళ్ళకు దండం పెట్టి, ఆయనను పెద్దన్నగా అభివర్ణించాడు. తాను ఎవరి కాళ్ళకు దండం పెట్టనని, తాను అమితంగా గౌరవించే వారిలో అన్నయ్య ఒకరని అన్నారు. తన నిర్మాణకత్వంలో వచ్చిన మొదటి సినిమాకు కూడా అన్నయ్యే పాటలు రాశారనీ, చాన్నళ్ళ తరువాత మళ్ళీ అన్నయ్య వరుణ్ సినిమాకు పాటలు రాయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ