ఈ ఏడాది నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఆ సినిమా తెచ్చిన విజయంతో ఆయన ‘షేర్’ అనే సినిమాను మొదలు పెట్టారు. ఈ ఆడియో ఫంక్షన్ నందమూరి ఫామిలీ మెంబర్స్ మధ్య ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నందమూరి కణ్యాన్ రామ్ మాట్లాడుతూ ''నందమూరి హీరోలంతా ఒక్కటే. తాతగారి తర్వాత బాబాయ్, ఆయన తర్వాత నాన్నగారు, ఆ తర్వాత నా తమ్ముడు మేమంతా ఓ పరంపరగా వస్తున్నాం. ఆ తర్వాత మోక్షజ్ఞ రావొచ్చు, అభయ్‌రామ్ రావొచ్చు, నా కొడుకూ రావొచ్చు. ఈ పరంపర ఇలాగే కొనసాగుతుంది. మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి'' అన్నారు. కల్యాణ్‌రామ్, సోనాల్ చౌహాన్ జంటగా నటించిన 'షేర్' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగింది. ఆడియో వేడుకతో పాటు ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రానికి మల్లికార్జున దర్శకత్వం వహించగా, తమన్ స్వరాలు సమకూర్చారు. పాటల సీడీలను హీరో ఎన్టీఆర్, నందమూరి రామకృష్ణ ఆవిష్కరించారు. ప్రచార చిత్రాన్ని పరుచూరి వెంకటేశ్వరరావు విడుదల చేశారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ... ''మల్లికార్జున్‌తో కల్యాణ్‌రామ్ అన్నయ్య చేస్తున్న మూడో సినిమా ఇది. మనం ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎంత ప్రభావం చూపించామన్నది ముఖ్యం. ఆ ప్రభావం ఈ సినిమా తీసుకురావాలని కోరుకొంటున్నా. తమన్ సృజనాత్మకంగా ఆలోచించి సంగీతం ఇస్తాడు. ఈ సినిమా పాటలు బాగున్నాయి. సాంకేతిక నిపుణులందరికీ ఈ సినిమా ఉత్సాహాన్ని తీసుకురావాలని కోరుకొంటున్నా .అన్నయ్య ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఇంతే నిజాయితీగా ఉండాలి. ఆయనకు ఈ సినిమా పెద్ద విజయాన్ని అందించాలి''అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ... ''తమన్ మంచి పాటలిచ్చాడు. నేపథ్య సంగీతమూ ఆకట్టుకుంది. కల్యాణ్‌రామ్‌తో నాది 12 ఏళ్ల ప్రయాణం. తన నమ్మకమే ఈ సినిమా. ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, దామోదర్‌ప్రసాద్, అనిల్ రావిపూడి, వక్కంతం వంశీ, శ్రీమణి, కందికొండ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.