డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్ సమర్పణలో మల్లికార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘షేర్’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. జూలై 5 డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ పుట్టినరోజు సందర్భంగా ‘షేర్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, డిజిటల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కొమర వెంకటేష్ మాట్లాడుతూ ` ‘‘మా హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘షేర్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, డిజిటల్ పోస్టర్‌ను విడుదల చేశాం. నిర్మాతల హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌గారితో సినిమా చెయ్యడం చాలా ఆనందంగా వుంది. ‘పటాస్’తో సూపర్‌హిట్ సాధించిన కళ్యాణ్‌రామ్‌గారికి ‘షేర్’ కూడా మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌గారు ఓ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లోనే రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. దర్శకుడు మల్లికార్జున్ మాట్లాడుతూ ` ‘‘మా ‘షేర్’ కళ్యాణ్ రామ్‌గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కళ్యాణ్‌రామ్‌గారి కెరీర్‌లో ‘షేర్’ ఒక సెన్సేషనల్ మూవీ అవుతుంది. నందమూరి అభిమానులు పండగ చేసుకునేలా ఈ సినిమా వుంటుంది. ‘పటాస్’ తర్వాత మళ్ళీ కళ్యాణ్‌రామ్‌గారు ఈ సినిమాలో విజృంభించి నటించారు’’ అన్నారు. డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్, సోనాల్‌చౌహాన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్, రోహిణి, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, ఆలీ, పృథ్వి, షఫి, ప్రియ, మౌనిక, ఆర్.కె. ఎం.ఎస్.నారాయణ, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, విక్రంజీత్ సింగ్, భరత్, రఘు కారుమంచి, జీవా, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, దువ్వాసి మోహన్, గిరి, తాగుబోతు రమేష్, సత్య, కాదంబరి కిరణ్, మాస్టర్ గౌరవ్, మాస్టర్ నిఖిల్, రామ్‌ప్రసాద్, రచ్చ రవి, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, వేణుగోపాల్, జిమ్ క్యారీ, మౌళిక, సత్యశ్రీ, కీర్తి, శ్వేత, కోటేశ్వరరావు మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ`మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: థమన్ ఎస్.ఎస్., ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి, ఆర్ట్: సత్యశ్రీనివాస్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, స్టిల్స్: మనీషా ప్రసాద్, డాన్స్: దినేష్, గణేష్, జాని, పాటలు: కందికొండ, శ్రీమణి, వరికుప్పల యాదగిరి, ఛీఫ్ కోడైరెక్టర్: శేషు బలగ, అసోసియేట్ డైరెక్టర్స్: జయరాజా సింగ్, కుమారస్వామిరెడ్డి, గీతా సి.శేఖర్, అసిస్టెంట్ డైరెక్టర్స్: అనిరుధ్, నల్లమల వెంకటేష్, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్, నిర్మాత: కొమర వెంకటేష్, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: మల్లికార్జున్.