విభిన్న సినిమా నాయకుడు కమల్ హాసన్ ఇప్పుడు హిందీలో ఓ సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. కమల్ మరో చరిత్ర సమయంలోనే హిందీలోకి అడుగు పెట్టేశాడు. ఇప్పుడు ఇండియాలో కమల్ హాసన్ తెలియని సినీ అభిమానులు ఉండరు. కేవలం ఇండియాకే పరిమితం కాలేదు కమల్ హాసన్ ప్రపంచ దేశాల్లోనూ ఈయన బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ లో‘అమర్‌హై’ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఏక్‌దూజె కే లియే, ఏక్‌నై పహేలి, గిరఫ్‌తర్, నయా అందాజ్, దో దిల్ దివానే అలా పలు సూపర్ హిట్ చిత్రాలు కమలహాసన్ ఖాతాలో ఉన్నాయి. ఆయన హిందీలో నటించిన చివరి చిత్రం చాచీ 420. ఇది1997లో తెరపై కొచ్చింది. ఆ తరువాత కమల్ హిందీలో నటించ లేదు. సుమారు ఎనిమిదేళ్ల తరువాత అమర్‌హై అంటూ బాలీవుడ్ పునః ప్రవేశానికి సన్నద్ధమవుతున్నారు. ఇందులో విశేషాలు చాలానే ఉన్నాయి. అమర్‌హై చిత్రానికి దిశ నిర్థేశకుడు కమలే. ఇప్పటి వరకూ కమల్ హాసన్ హిందీలో నటనకు మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పుడు కథకుడు, నటుడు, దర్శకుడు అంటూ మూడు విభాగాల్లో విజృంభించనున్నారు. ఇది మల్టీస్టారర్ చిత్రం. కమల్‌తో పాటు సైఫ్ అలీఖాన్ కథానాయకుడిగా నటించనున్నారు. అసలు ఈయన్ని దృష్టిలో పెట్టుకునే కమల్ ఈ చిత్ర కథను తయారు చేశారట. ఇది రాజకీయం, అండర్‌వరల్డ్ మాఫియాల నేపథ్యంలో సాగుతుందట. దీన్ని ముంబయి నిర్మాతలు వీరేంద్ర కే అరోరా, అర్జున్‌ఎ కపూర్ నిర్మించనున్నారు.ప్రస్తుతం కమల్ తూంగావనం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తరువాత అమర్‌హై చిత్రానికి సిద్ధం కానున్నారు.