తారలు నటనలో జీవిస్తారా...జీవిస్తూ నటిస్తారా అనేది అర్థం కాని విషయం... విడిపోయే స్థాయికి వచ్చారంటే ఎంత భావోద్వేగాలకు గురి కావాలి... అది కూడా ఏదో రెండు మూడేళ్ళ బంధం కాదు వారిది. ఇద్దరు పిల్లలూ దాదాపు యుక్తవయస్సుకు వచ్చిన సమయంలో విడిపోయారు... ప్రేమానురాగాల విషయానికి వస్తే కమల్ తన పిల్లలపై ఉన్న అనుబంధాన్ని చాలా ఇంటర్వ్యూల్లో ఎంతో హత్తుకునేలా మాట్లాడారు. ఇన్నాళ్ళ తరువాత ’షమితాబ్’ ఆడియో ఫంక్షన్ లో ఈ మాజీ దంపతులిద్దరూ ఎదురుపడడం... భావోద్వేగాలెలా ఉన్నా... అందరికీ ఒక టాపిక్ అవకుండా ఇలా విష్ చేసుకోవడం చాలా డీసెంట్ గా కనిపిస్తోంది కదూ... భార్యా భర్తలే కాదు... ఏ రంగంలోనైనా ఒకరికొకరు మనస్పర్థలు ఉన్న వారు చాలా మందే ఉంటారు... నలుగురిలో వారి భావోద్వేగాలు బయట పడనీకుండా ఇలా ఒకరికొకరు కరచాలనం చేసుకోవడంలోనే వారి ఔన్నత్యం కనిపిస్తుంది.