యూనివర్సల్ హీరో కమల్ హాసన్ చిత్రాలు ఎంత డిఫరెంట్స్ కాన్సెప్ట్ లతో ఉంటాయో అన్నే వివాదాలను క్రియేట్ చేస్తాయి. తాజాగా విడుదలకు రెడీ అవుతోన్న ‘ఉత్తమవిలన్’ చిత్రం కూడా వివాదాస్పదంగా మారింది. ఇక అవన్నీ పక్కకు పెడితే ఆయన తీసుకున్న మరో నిర్ణయం ఇప్పుడు తమిళనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్వరలో కమల్ కులవ్యవస్థపై ఓ సినిమాని తెరకెక్కించాలనుకుంటున్నాడట. తమిళనాట 1960లో ఓ భూస్వామి కులం కారణంగా నలభై మందికి పైగా దళితులను హతమార్చాడు. అప్పట్లో పెద్ద గొడవలు రేగాయి. ఈ నిజ ఘటన ఆధారంగా కమల్ ‘ఉల్లేన్ అయ్యా’ పేరుతో సినిమాని రూపొందిచాలనుకుంటున్నాడట. స్టోరి కూడా సిద్ధమైందని సమాచారం. మరి ఈ చిత్రం ఎన్ని వివాదాలకు తావిస్తుందో చూడాలి...