కమల్ హాసన్, సుహాసిని వరుసకు బాబాయ్ అమ్మాయి అవుతారనే సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల సుహాసిని భర్త, ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓకే కణ్మణి అలియాస్ ఓ కాదల్ కణ్మణి అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను కేవలం క్వాలిటీ పీపుల్ మాత్రమే రివ్యూ చేయాలని, కంప్యూటర్ ని ఆపరేట్ చేసే ప్రతి ఒక్కరూ రివ్యూలు రాసేయడం తగదనీ, తాము 23 ఏళ్లుగా ఈ రంగంలో క్వాలిటీ సినిమాలు తీస్తున్నామని, క్వాలిటీ టెక్నీషియన్లు సినిమాలు చేస్తున్నప్పుడు ఆ సినిమాలను క్వాలిటీ వ్యక్తులే రివ్యూ చేయాలని వ్యాఖ్యానించారు. ఆమె మాట్లాడిన తీరు తమిళనాడులో దుమారం లేపింది. దీని గురించి కమల్ హాసన్ స్పందించారు. ఎవరినీ ఎక్కడా కంట్రోల్ చేయలేమనీ, పెరుగుతున్న మీడియా దృష్ట్యా ఇలాంటివి తప్పదని అన్నారు. అదే సమయంలో సుహాసిని తన భావాన్ని వ్యక్తీకరించడం కూడా తప్పు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.