గాంధీనగర్ రెండో వీధి, దయామయుడు, శ్రీనివాస కళ్యాణం తదితర తెలుగు సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన గౌతమి తెలుగు సినిమాలకన్నా, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. అప్పట్లో గ్లామర్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌతమి తమిళంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. పెళ్ళి తరువాత సినిమాలకు దూరమైంది. ఇప్పుడు నటుడు కమల్‌హాసన్‌తో సహజీవనం చేస్తోంది. ఇటీవలే వీరిద్దరూ కలిసి నటించిన ‘పాపనాశం’ చిత్రం ఘనవిజయం సాధించడంతోపాటు, నటి గౌతమికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో గౌతమి ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనే ప్రయత్నాల్లో వున్నాడు కమల్‌హాసన్. ఈ చిత్రానికి ఆయన కథను రెడీ చేస్తున్నాడట. ఈ సినిమాతో గౌతమికి మళ్లీ కెరీర్‌కు ప్లస్ అయ్యేలా వుండేందుకు చర్యలు తీసుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని కమల్ నిర్మిస్తాడని కోలీవుడ్ సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చే అవకాశం వుంది.