‘ఐ’ చిత్రం తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ తన నెక్స్ ట్ చిత్రానికి సమయాత్తమవుతున్నాడు. ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ విలన్ గా నటించే అవకాశం ఉందని ఫిలింనగర్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఓ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ చిత్రం బడ్జెట్ దాదాపు మూడు వందల కోట్లు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ భారీ చిత్రం 2016లో ప్రారంభం కావచ్చునట. గతంలో కమల్ హీరోగా, రజనీ విలన్ గా చేసిన సినిమాలున్నాయి. అయితే రజనీ హీరోగా, కమల్ విలన్ గా చేయాల్సి వస్తే, అదే మొదటి సినిమా అవుతుంది. మరెమవుతుందో చూడాలి....