అట్టహాసంగా ‘కంచె’ ఆడియో వేడుక

September 18, 2015 | 12:43 PM | 2 Views
ప్రింట్ కామెంట్
varun-tej-kanche-audio-launch-niharonline

ఓ కొత్త కథాంశంతో మెగా ఫామిలీ హీరో వరుణ్ తేజ్, ప్రగ్యాజైశ్వాల్‌ జంటగా నటించిన సినిమా కంచె. ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ఆడియోను వినాయక్ చవితిని ముహూర్తంగా నిర్ణించారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు చిరంతన్‌ భట్‌ సంగీతాన్ని సమకూర్చారు. ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. బిగ్‌ సీడీని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌, ఆడియో సీడీలను సీతారామశాస్త్రి విడుదల చేశారు. తొలి సీడీని ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులుల మాట్లాడుతూ....
 ‘‘సాధారణంగా మనం ఫ్యామిలీ, లవ్‌స్టోరీలంటూ చాలా రకాలైన సినిమాలు చూస్తూ ఉంటాం. అయితే ప్రపంచ సినిమాలో ఎవరూ ఎన్ని సినిమాలు చేసినా వార్‌ బ్యాక్‌డ్రాప్‌తో, లవ్‌ స్టోరీ మిక్స్‌ అయ్యుంటే ఆ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది. నేను చేయాలనుకున్న కథను క్రిష్‌ చేసేశాడు. ఈ క్రెడిట్‌ అంతా క్రిష్‌కే చెందుతుంది.’’ అన్నాడు చిత్రంలో చిన్న రోల్ చేసిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్.
‘‘ఈ చిత్రం ట్రైలర్ మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంది. వరుణ్‌లో ఇంటెన్సిటీ తెరపై ట్రైలర్‌లో కనిపించింది. డైరెక్టర్స్ లో ప్రేక్షకుల అభిరుచిని ఆధారంగా చేసుకుని పైకొచ్చేవారు కొందరుంటారు. ప్రేక్షకుల అభిరుచి స్థాయిని పెంచాలనుకునేవారు మరికొందరుంటారు. డైరెక్టర్ క్రిష్ రెండో కోవకు చెందిన వాడు” అన్నారు నిర్మాత అల్లు అరవింద్.
‘‘ఈ రోజు కంచె ఆడియో వేదికలా కాకుండా సీతారామశాస్త్రిగారిని గౌరవించుకునే వేదికలా ఉంది. ఇండస్ట్రీలో పెద్ద డైరక్టర్లు ఉన్నా వారిని నేను సినిమా చేద్దామని అడగలేదు. కానీ ఐదేళ్ళుగా సినిమా చేద్దామని క్రిష్‌ని అడుగుతున్నా. నేను ప్రకాష్‌, రానా, క్రిష్‌ అందరం ఒక బ్యాచ్‌. ఒకరోజు క్రిష్‌ కథ ఉందని చెబితే ఇంటికి రమ్మన్నా. వచ్చి కథ చెప్పాడు. సెకండాఫ్‌ కథ చెప్పడానికి రాలేదు. ఆ సబ్జెక్ట్ కి నేను సెట్‌ కానని అనుకున్నాడా? లేక ఆ కథనే వరుణ్‌తో తీశాడా? అని అనుకున్నాను. ఒకవేళ అదే కథని వరుణ్‌తో తీసుంటే క్రిష్‌ అయిపోతాడు.(నవ్వుతూ)” అన్నాడు రాంచరణ్.
‘‘సినిమా యుద్ధ నేపథ్యంలో జరిగే సినిమా అయినా ఇదొక ప్యూర్ లవ్‌స్టోరి. 1940ల్లోని ప్రతి సీన్ ను సినిమాటోగ్రాఫర్ బాబా అందంగా చూపించారు. ఆయన విజన్ చూసి చూసి చాలా ఆనందించాను. డాడీ మంచి సినిమా చేస్తున్నాను. మీ పరువు నిలబెడుతానని చెబుతున్నా, మా బాబాయ్‌కి కూడా ఈ సినిమా విడుదలైన తర్వాత పక్కాగా తీసుకెళ్ళి చూపిస్తా. సినిమా ఎలా ఉందని అడుగుతా. చరణ్‌ అన్నా, బన్నీ అన్నా, తేజ్‌ అందరికీ థాంక్స్‌. నా సినిమాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్” అన్నారు హీరో వరుణ్ తేజ్.
‘‘70 ఏళ్ళ తర్వాత రెండో ప్రపంచయుద్ధం మీద సినిమా తీశాను. ఈ సినిమా కోసం యూనిట్ చాలా కష్టపడింది. సినిమాలో వరల్ఢ్ వార్ పార్ట్ ను జార్జియాలో షూట్ చేశాం. అందుకోసం. జార్జియా గవర్న్ మెంట్‌ అనుమతి తీసుకుని ఆ బ్యాక్‌డ్రాప్‌కి తగిన విధంగా గన్స్‌, ట్యాంకర్స్‌, టీకప్స్‌ ఇలా అన్నీ ఉపయోగించాం. ఆర్ట్‌ డైరెక్టర్‌ సాహి సురేష్‌, సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌ వండర్‌ఫుల్‌ ఎఫర్ట్‌ పెట్టి వర్క్‌ చేశారు. మనకు చాలా మంది దర్శకులున్నా ఎందుకో రెండో ప్రపంచయుద్ధం గురించి కథను తీయలేదు. నేను ఎవరికీ విభిన్నంగా ఉండాలని ఈ కథను చెప్పలేదు. ఒక ప్రయత్నం. చెప్పని కథలను చెప్పడానికి అవకాశమిచ్చిన నిర్మాతలకు, నా కోసమే అందమైన హీరోని కన్న నాగబాబుగారికి, మంచి ఫ్రెండ్‌ చరణ్‌కి, అమ్మానాన్నలకు, గురువుకు సహా అందరికీ థాంక్స్” అని చెప్పారు దర్శకుడు క్రిష్.,
‘‘నేను కొన్ని సీన్స్‌ చూశాను. తనలో చాలా విషయముందని అర్థమైంది. ముకుంద తర్వాత కంచె వరుణ్‌తేజ్‌కి రెండో మెట్టు. ఇప్పుడు మూడో సినిమా పూరితో ‘లోఫర్’ చేస్తున్నాడు. ‘లోఫర్‌’ తో వరుణ్‌ బాక్సాఫీస్‌ బద్ధలు కొడతాడు. చిరంజీవిగారిని యుద్ధభూమిలో చూసి ఉంటారు. ఈ సినిమాతో వరుణ్‌ వాళ్ళ పెదడాడీని మించిపోవాలి. ఇప్పటి వరకు ఎవరూ చేయని కాన్సెప్ట్ తో క్రిష్‌ సినిమా చేయడం ఆనందంగా ఉంది. శాస్త్రిగారు అద్భుతమైన సాహిత్యం రాశారు” అన్నారు నిర్మాత సి. కళ్యాణ్.
‘‘ఈ సినిమా కోసం చాలా మందిలాగానే నేను కూడా వెయిట్‌ చేస్తున్నాను. రైటర్ సాయిమాధవ్‌ డైలాగులు పరమ అద్భుతం అయితే మా అన్న సీతారామశాస్త్రిగారు మహాద్భుతంగా రాశారు. ఈ సినిమాతో వరుణ్ మంచి పేరు తెచ్చుకుంటే నిజమైన పుత్రోత్సాహం నాకు వస్తుంది” అని అన్నారు నాగ బాబు. ఇంకా ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్, పాటలకు సాహిత్యం అందించిన సీతారామ శాస్త్రి తదితరులు మాట్లాడారు.
ఈ సినిమాలో విలన్ గా నికితన్ ధీర్ నటించాడు. ఇంకా అవసరాల శ్రీనివాస్, గొల్లపూడి, షావుకారు జానకి, సింగీతం శ్రీనివాస్, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ