కాపీ కథలు టాలీవుడ్ కు కొత్తేమీ కాదు. హాలీవుడ్, కొరియన్, హాంకాంగ్, థాయ్, జపనీస్, కొరియా ఇలా ఏ కథ పడితే దాన్ని తీసేసుకుని యాజ్ ఈటీజ్ గా గుద్దిపడేయటం మన దర్శకులకు కొత్తేమీకాదు. రికార్డులు కొల్లగొట్టిన బాహుబలి నుంచి తాజాగా విడుదలయిన అఖిల్ డెబ్యూ మూవీ పోస్టర్ వరకు అన్ని పరభాషా చిత్రాల నుంచి కాపీ కొట్టినవని ఒప్పుకోవాల్సిందే. ఇక ఇప్పుడు మరో హాలీవుడ్ కథ ఇప్పుడు టాలీవుడ్ కి దిగుమతి అయ్యిందని టాక్.
క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం కంచె. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిందని తెలుస్తోంది. యుద్ధ సమయంలో ఓ ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన ప్రేమ లేఖల సారాంశమే ఈ స్టోరీ. అయితే ఇది కూడా ఓ హాలీవుడ్ కథేనట. డియర్ జాన్ పేరిట 2010 లో ఓ ఆంగ్ల చిత్రం వచ్చింది. 2006 లో నికోలస్ స్పార్క్స్ రచించిన డియర్ జాన్ ఆధారంగా ఈ నవల తెరకెక్కింది. ఇక ఈ నవల ను కాపీ కొట్టి క్రిష్ కంచెను అల్లాడని భోగట్టా.
అయితే దర్శకుడు క్రిష్ కావటంతో కథలో కాస్త క్రియేటివిటీని తప్పకుండా జోడిస్తాడని నమ్మకం. ఇప్పటికే విడుదలైన ఈ ట్రైలర్ కి విశేష స్పందన లభిస్తోంది.