‘కంచె’ సరికొత్త ప్రమోషన్

October 10, 2015 | 04:06 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Kanche_Movie_New_Photos_niharonline1

ఓ కొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఈయన ఇంతకు ముందు సినిమాలు కూడా విభిన్న కథాంశాలే. బ్లాక్ బస్టర్స్ కాకపోయినా కొత్త కథలు క్వాలిటీగా అందించే దర్శకుడిగా క్రిష్ కు మంచి పేరుంది. వేదం, గమ్యం, కృష్ణం వందే జగద్గురుం వంటి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించిన క్రిష్ ఈసారి స్వాతంత్యానికి ముందు జరిగిన ఓ కథతో ‘కంచె’ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, తన రెండో సినిమా కంచెలో ఓ డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తూ ఆకట్టుకోనున్నారు. ఇప్పటికే సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా, నవంబర్‌ 6న విడుదల కానుంది. ఇక సినిమా విడుదలకు నెలరోజుల ముందునుంచే ప్రమోషనల్ కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో నడిచే సినిమా కావడంతో ఈ నేపథ్యానికి సంబంధించిన వివరాలను, విశేషాలను, అప్పటి పరిస్థితులను సినిమాలో ఒడిసిపట్టారనే విషయాన్ని తెలుపుతూ కంచె టీమ్, కంచె మేకింగ్ డైరీ పేరుతో పుస్తకం విడుదల చేస్తోంది. ఈ పుస్తకంలో కంచె సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర సమాచారాన్ని పొందుపరిచారు. త్వరలోనే ఈ పుస్తకం మార్కెట్లో విడుదల కానుంది. ఇప్పుడు సినిమాలకు చేస్తున్న ప్రమోషన్ లో ఇది ఒక సరికొత్త ప్రచారంగా జనాల్లో ఆసక్తి పెరిగింది అందులో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన విశేషాలేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కూడా జనాల్లో క్రియేట్ చేస్తున్నారు.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ