బాలీవుడ్ క్వీన్ 85 ఏళ్ళ వృద్ధురాలైపోతోందట...

November 04, 2015 | 04:51 PM | 1 Views
ప్రింట్ కామెంట్
kangana_turned_old_woman_niharonline

ఆ మధ్య తమన్న ‘మనం’ సినిమా విడుదలైనప్పుడు ఓ ఇంటర్వ్యూలో నాగార్జునకు ఈ సినిమాలో అమ్మగా (పునర్జన్మ) నటించారు కదా... ఏ సినిమాలోనైనా తల్లిగా ఛాన్స్ వస్తే నటిస్తారా అంటే ‘నెవర్’ అనేసింది. అంతే గానీ పాత్రను బట్టి చేయాల్సి వస్తే చేస్తానని చెప్పలేదు. కానీ ఈ జాతీయ అవార్డులు అందుకున్న భామ, బాలీవుడ్ లో హై రెమ్యునరేషన్ అందుకుంటున్న కంగన మాత్రం ఓ 85 ఏళ్ళ ముసలి పాత్రను చేయడానికి ఒప్పేసుకుందట. ‘తను వెడ్స్ మను’ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ అమ్మడు ఆ తరువాత బాలీవుడ్ క్వీన్ గా ఎదిగిన ఎదిగింది. మరి అప్పుడే ముసలి పాత్రలేంటి అనుకుంటున్నారంతా... చూడటానికి చాలా సెక్సీగా, మత్తెక్కించే కళ్లతో, ఉంగరాల జుట్టుతో, పిచ్చెక్కించే హాట్ హాట్ డ్రెస్సులలో యంగ్ గా కనిపించే ఈ అమ్మడు ఇంత తక్కువ వయసులో ముసలి పాత్రలు చేస్తోంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దర్శకుడు శేఖర్ కపూర్ ఓ చిత్రాన్ని ప్లాన్ చేసాడు. ఇందులో కంగనా పాత్ర వయసు 85 ఏళ్లు. ఈ విషయాన్ని స్వయంగా కంగనాయే చెప్పుకొచ్చింది. ఇటీవలే 17వ జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ లో కంగనా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
అయితే ఈ సినిమా టాక్స్ లోనే ఉందంటూ... పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలు ఎంచుకోవడంలో తప్పేమీ లేదనీ, అంత మాత్రం చేత ముసలి వాళ్ళం అయిపోం కదా... నటులన్నాక అన్ని పాత్రలూ ఛాలెంజింగ్ గా తీసుకోవాలని అంటోందట.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ