భారతీయులు అన్ని రంగాల్లోనూ తమ కీర్తిని చాటుకుంటున్నారు. చలచిత్ర రంగంలో మరింత ముందడుగు వేస్తున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రతిష్ఠాత్మక లోకార్నో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ పోటీల్లో కన్నడ దర్శకుడు రూపొందించిన చిత్రం రెండు అవార్డులు గెలుచుకుంది. బెంగళూరుకు చెందిన కన్నడ దర్శకుడు రాం రెడ్డి ‘తిథి’అన్న చిత్రాన్ని రూపొందించారు. కొత్త నటీనటులతో రూపొందించిన ఈ చిత్రం లోకార్నో ఫిలింఫెస్టివల్ లో రెండు అవార్డుల్ని సొంతం చేసుకుంది. గత ఎనిమిదేళ్లుగా ఈ అవార్డును సొంతం చేసుకోవాలని భారతీయుల ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. భారత సంప్రదాయాన్ని, భారతీయుల గొప్పతనాన్ని తాను ఈ సినిమాలో చూపించానని.. జీవితాన్ని ఎంత సాధారణంగా జీవించొచ్చు అన్న విషయాన్ని తిథిలో తెరకెక్కించినట్లు దర్శకుడు రాం రెడ్డి చెప్పారు. ఈ చిత్రం తన కలల ప్రాజెక్టుగా అభివర్ణించిన ఆయన, కొత్తవారితో తీసిన ఈ సినిమా విజయవంతం కావటంతోపాటు రెండు అవార్డులు గెలుచుకోవటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాం రెడ్డే కాదు ప్రతి భారతీయుడు సంతోషించే అంశం ఇది.